రాఘవేంద్ర రావు నుంచి కోదండరామిరెడ్డి వరకు.. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ట్విస్ట్

Published : Feb 23, 2026, 06:22 PM IST

చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు చిత్ర సక్సెస్ సెలెబ్రేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా నిర్వహించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ట్విస్ట్ నెలకొంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం మాసివ్ హిట్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆల్రెడీ ఈ చిత్రానికి గ్రాండ్ గా సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. మూవీ ఓటీటీలో కూడా రిలీజ్ దుమ్ము లేపుతోంది.

25
చిరంజీవిని సన్మానించిన కెవి రావు

చిరంజీవి, నయనతార జంటగా నటించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ లో మెరిశారు. చాలా రోజుల తర్వాత అభిమానులు చిరంజీవి స్టైల్, కామెడీ టైమింగ్ ని బాగా ఎంజాయ్ చేశారు. ఈ చిత్రణ ఓటీటీలోకి విడుదలైన తర్వాత కూడా సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు చిత్రణ భారీ హిట్ కావడంతో చిరంజీవిని సత్కరించడానికి కాకినాడ పోర్ట్ చైర్మన్ కెవి రావు సక్సెస్ పార్టీ నిర్వహించారు.

35
సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ట్విస్ట్

ఈ పార్టీకి అతిరథ మహారథులు హాజరయ్యారు. ట్విస్ట్ ఏంటంటే ఈ సక్సెస్ పార్టీలో పొలిటీషియన్స్ కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు లాంటి రాజకీయ నేతలు హాజరు కావడం విశేషం. వీరితో పాటు టాలీవుడ్ సీనియర్ దర్శకులు రాఘవేంద్ర రావు, కోదండ రామిరెడ్డి లాంటి వారు కూడా ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

45
అగ్ర దర్శకులు హాజరు

వీరందరి సమక్షంలో చిరంజీవికి సన్మానం జరిగింది. ఈ సక్సెస్ పార్టీలో చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల.. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు. అదే విధంగా డైరెక్టర్ బి గోపాల్, అశ్విని దత్, బాబీ లాంటి వారు కూడా పాల్గొన్నారు.

55
ఆ దర్శకులతో అత్యధిక సినిమాలు

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాఘవేంద్ర రావు, కోదండరామిరెడ్డి లాంటి దర్శకులతో చిరంజీవి అత్యధిక సినిమాలు చేశారు. కోదండరామిరెడ్డితో చిరంజీవి 23 సినిమాల వరకు చేశారు. వారిలో అత్యధిక సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడ్డాయి.

Read more Photos on
click me!

Recommended Stories