బ్రహ్మానందం, ఏవీఎస్ మధ్య గొడవ, రంగంలోకి దిగి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Published : Oct 16, 2025, 04:47 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో గొడవలు కామన్, స్టార్స్ మధ్య మన్పర్ధలు కామన్, అవి రచ్చకెక్కి, మీడియా వరకూ వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో బ్రహ్మానందం, ఏవీఎస్ మధ్య జరిగిన గొడవ ఒకటి. వీరి ఇష్యూను తీర్చడానికి రంగంలోకి దిగిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

PREV
16
స్టార్స్ మధ్య మనస్పర్ధలు

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ మధ్య మనస్పర్థలు కామన్, ఇండస్ట్రీలో వివాదాలతో మీడియా ముందుకు వచ్చి రచ్చ చేసిన సంఘటలను చాలా ఉన్నాయి. కొన్ని గొడవల కారణంగా ఇప్పటికీ కొంత మంది సెలబ్రిటీల మధ్య సరిగ్గా మాటలు లేవు. మరికొంత మంది మాత్రం ఏదో పలకరించుకుంటారు కానీ.. ఎవరికి ఉండాల్సిన కోపం వారికి ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు మాత్రం వారు విమర్శలు చేసుకుంటుంటారు. గతంలో టాలీవుడ్ లో ఇలాంటి సంఘటలను చాలా జరిగాయి. ఎన్నో గొడవలు కాలగర్భంలో కలిసిపోయాయి. వాటిలో కామెడీ స్టార్స్ మధ్య వచ్చిన కొన్ని సంఘటలను కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ కమెడియన్స్ అయిన బ్రహ్మానందం, ఏవీఎస్ మధ్య ఓ గొడవ చాలా పెద్దదిగా మారింది. అప్పుడు ఓ స్టార్ హీరో రంగంలోకి దిగి ఈ సమస్యకు పరిష్కారం చూపించారు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో?

26
బ్రహ్మానందం- ఏవీఎస్ వివాదం

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్స్ గా ఉన్నారు బ్రహ్మానందం- ఏవీఎస్ . ఇద్దరు కలిసి పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. శుభలగ్నం లాంటి సినిమాల్లో వీరి కామెడీ ఎంత హైలెట్ అయ్యిందంటే ఆడియన్స నవ్వలేక పొట్ట పట్టుకునేంతగా ఈ ఇద్దరు కమెడియన్స్ కామెడీని జనరేట్ చేశారు. ''ఇరుకుపాలెం వాళ్లు అంటే ఏదో ఎకసెక్కాలుగా ఉంది'' అంటూ బ్రహ్మానందం ఓ సినిమాలో ఏవీఎస్ తో ఆడుకునే తీరు, వద్దన్న నవ్వుతెప్పిస్తుంది. ఎటువంటి వల్గారిటీ లేకుండా ఈ స్టార్ కమెడియన్స్ పంచిన ఆరోగ్యకరమైన హాస్యం ఇప్పుటి జనరేషన్ లో వెతికినా దోరకదు. ఎన్నో సినిమా చేయాల్సిన ఏజ్ ఉన్న ఏవీఎస్, అనారోగ్యంతో అకాలమరణం పొందారు. అయితే ఇండస్ట్రీలో బ్రహ్మానందం- ఏవీఎస్ మధ్య జరిగిన వివాదం మాత్రం ఓ మచ్చలామిగిలిపోయింది.

36
బ్రహ్మీకి వ్యతిరేకంగా మీటింగ్

వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలియదు కానీ.. బ్రహ్మానందానికి వ్యతిరేకంగా ఏవీఎస్ మాత్రం ఓ గ్రూప్ ను ఫామ్ చేశారు. కొంత మంది కమెడియన్స్ తో బ్రహ్మీకి వ్యతిరేకంగా ఓ మీటింగ్ కూడా పెట్టారు. ఈ మీటింగ్ టాలీవుడ్ లో పెద్ద సంచలనంగా మారింది. చాలామంది కమెడియన్స్ ఆ మీటింగ్ కు వెళ్లారు. ఆ గొడవ అలా పెద్దది అయ్యి, మీడియా వరకూ వెళ్లడంతో.. పరిస్థితులు చేదాటిపోయాయి. ఇలా వదిలేస్తే ఏం జరుగుతుందో ఏమో అని టాలీవుడ్ పెద్దలు భావించారు. వెంటనే ఓ స్టార్ హీరో రంగంలోకి దిగి పరిస్థితులు చేదాటిపోకుండా చూసుకున్నారు. అందరితో మాట్లాడి పరిష్కారం కోసం చర్చలు జరిపారు.

46
రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి

బ్రహ్మానందం, ఏవీఎస్ మధ్య గొడవ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఎంటర్ అయ్యారు. అందరితో మాట్లాడారు. తన ఇంటికి పిలిపించుకుని విషయం ఏంటో కనుకున్నారు. ఆతరువాత అందరికి అర్ధం అయ్యేలా హితబోధ కూడా చేశారు. అందరు ఇండస్ట్రీలో ఉండేవారే.. ఏదో ఒక సినిమాలో పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు, ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సి వస్తుంది. అందరం ఇండస్ట్రీ వారమే, మనలో మనం ఇలా కొట్టుకోవడం ఏంటయ్య.. ఏదైనా ఉంటే మనలో మనం చూసుకోవాలి కానీ.. మీడియా వరకూ వెళ్తే అది చిరాగ్గా ఉంటుంది. ఇండస్ట్రీ పరువుపోతుంది, ఏదైనా ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకుందాం అని చిరంజీవి వార్నింగ్ ఇచ్చినట్టు ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ జెన్ని వివరించారు.

56
ఏవీఎస్ ఏమన్నారంటే..?

గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో దివంగత స్టార్ కమెడియన్ ఏవీఎస్ ఈ విషయంపై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏవీఎస్ మాట్లాడుతూ.. '' చుట్టు ఉన్నవాళ్ల వళ్లే సమస్యలు పెద్దవి అవుతాయి. బ్రహ్మానందం విషయంలో నేను చేసింది పొరపాటే. ఈ ఇష్యూ జరిగిన తెల్లారి నేను బ్రహ్మానందంతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాను. అసలు మా మధ్య చిన్న గ్యాప్ తప్పించి పెద్ద పెద్ద గొడవలేమి లేవు.. ఆయన సినిమాలు నేను తీసుకున్నది లేదు, నా సినిమాలు ఆయన తీసుకున్నది లేదు. ఆతరువాతికి నేనే వెళ్లి బ్రహ్మానందంతో మాట్లాడాను విషయం అక్కడితో అయిపోయింది'' అని ఏవీఎస్ ఓపెన్ హార్డ్ విత్ ఆర్కేలో వెల్లడించారు.

66
ఆత్మ కథ రాసుకున్న బ్రహ్మానందం

టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం చాలా కాలం నుంచి సినిమాలు తగ్గించారు, అడపా దడపా గెస్ట్ రోల్స్ చేసుకుంటున్నారు. మిగిలిన టైమ్ లో తనకు నచ్చిన పని చేసుకుంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఆయన పెయింటింగ్ వేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. దాంతో పాటు తన ఆత్మకథను రాసుకున్నారు. ఈ బుక్ కు 'ME and मैं' అనే పేరును పెట్టారు బ్రహ్మానందం. ఇక రీసెంట్ గా ఈ బుక్ ను ఆవిష్కరించారు. ఈ బుక్ లో ఆయన ఏ కాంట్రవర్సీలు రాయలేదని, క్లాన్ గా ఉంటుందని ప్రకటించారు.

Read more Photos on
click me!

Recommended Stories