శివ రాజ్‌కుమార్‌కి చిరంజీవి స్పెషల్‌ విందు.. రాజ్‌కుమార్‌ని తలుచుకుంటూ పోస్ట్..

Published : Feb 04, 2024, 06:21 PM IST

కన్నడస్టార్‌ శివ రాజ్‌కుమార్‌.. చిరంజీవిని కలిశారు. ప్రత్యేకంగా తన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి విందు చేసిన ఫోటోలను చిరంజీవి షేర్‌ చేసుకున్నారు.   

PREV
15
శివ రాజ్‌కుమార్‌కి చిరంజీవి స్పెషల్‌ విందు.. రాజ్‌కుమార్‌ని తలుచుకుంటూ పోస్ట్..

మెగాస్టార్‌ చిరంజీవి.. కన్నడస్టార్ శివ రాజ్‌కుమార్‌ని ఎంతో ప్రేమతో ఇంటికి స్వాగతించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. శివ రాజ్‌కుమార్‌కి ప్రత్యేకంగా విందుని వడ్డించారు. ఇద్దరు కలిసి విందు ఆరగించారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు చిరంజీవి. మరి ఇంతకి ఈ ఇద్దరు ఎందుకు కలుసుకున్నారు, సందర్బం ఏంటనేది చూస్తే..
 

25

ఇటీవల చిరంజీవికి కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అంతా చిరంజీవికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఏకంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన్ని ఘనంగా సత్కరించింది. అంతకు ముందు ఉపాసన ప్రత్యేకంగా పార్టీ ఇచ్చింది. ఈ నేపథ్యం శివ రాజ్‌కుమార్‌.. చిరంజీవిని అభినందించడానికి బెంగుళూరు నుంచి స్వయంగా హైదరాబాద్‌ వచ్చారు. 
 

35

చిరంజీవికి ఇంటికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు పలు విషయాలను చర్చించుకున్నారు. అనంతరం చిరంజీవి.. శివ రాజ్‌కుమార్‌కి లంచ్‌ ఆఫర్‌ చేశారు. చిరంజీవి విందు వడ్డించారు. ఈ సందర్భంగా వీరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారట. అలాగే శివ రాజ్‌కుమార్‌.. కన్నడ ఒకప్పటి సూపర్‌ స్టార్‌ రాజ్‌కుమార్‌ని గుర్తు చేసుకున్నారట. 

45

తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్‌(ఎక్స్) చేశారు చిరంజీవి. నన్ను అభినందించడానికి నా ప్రియమైన శివన్నా బెంగుళూరు నుంచి రావడం నన్ను ఎంతగానో కదిలించింది. లంచ్‌లో అద్భుతమైన సమయాన్ని గడిపారు. లెజెండరీ రాజ్‌కుమార్‌, ఆయన కుటుంబంతో మా అనుబంధాన్ని చాలా ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాం. ఇది నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది` అంటూ పోస్ట్ చేశారు చిరంజీవి. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను పంచుకున్నారు. 

55
Rc16

ఇదిలా ఉంటే శివరాజ్‌ కుమార్‌ ఇప్పుడు తెలుగు సినిమాల్లో భాగమవుతున్నారు. స్పెషల్‌ రోల్స్ చేస్తున్నారు. గతంలో `గౌతమిపుత్ర శాతకర్ణి`లో మెరిశారు. ఇటీవల రజనీకాంత్‌ `జైలర్‌`లో ఆయన పాత్ర దుమ్ములేపింది. దీంతో ఇప్పుడు రామ్‌చరణ్‌ సినిమాలో నటిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఈ సమ్మర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో కీలక పాత్రలో శివ రాజ్‌కుమార్‌ని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవిని ఆయన కలవడం, ఇద్దరు కలిసి విందు చేయడం విశేషంగా చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories