ప్రముఖ కమెడియన్ కుమార్తె నిశ్చితార్థ వేడుక.. ఎంత గ్రాండ్ గా చేశారో చూడండి, ఫోటోస్

First Published | Feb 4, 2024, 4:07 PM IST

ప్రముఖ తమిళ హాస్య నటుడు రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ శంకర్ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇంద్ర శంకర్ కూడా నటిగా రాణిస్తున్నారు.

ప్రముఖ తమిళ హాస్య నటుడు రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ శంకర్ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇంద్ర శంకర్ కూడా నటిగా రాణిస్తున్నారు. బిగిల్, విరుమాన్, పాగల్ చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసింది. తమిళనాట ఇప్పుడిప్పుడే దర్శకుడిగా రాణిస్తున్న కార్తీక్ తో ఇంద్రజ నిశ్చితార్థం జరిగింది. 

ఇటీవల జరిగిన నిశ్చితార్థ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్తీక్, ఇంద్రజ నిచితార్థ వేడుక చెన్నైలో జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. 


వధూవరులు ఇద్దరూ సంప్రాదయ వస్త్ర ధారణలో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. నెలరోజుల్లోనే వీరి వివాహ వేడుక కూడా జరగబోతున్నట్లు తెలుస్తోంది. రోబో శంకర్ కోలీవుడ్ లో బిజీ కమెడియన్ గా ఉన్నారు. ఏడాదికి కనీసం 10 చిత్రాల్లో అయినా నటిస్తుంటారు. 

చాలా రోజుల నుంచి ఇంద్రజ, కార్తీక్ వివాహం గురించి వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నిశ్చితార్థ వేడుకలో తనకు కాబోయే భర్తపై ఇంద్రజ ముద్దుల వర్షం కురిపించింది. 

పెళ్లి ఫిక్స్ కాకముందే ఈ జంట పలు ఆలయాలని సందర్శించారు. నిశ్చితార్థ వేడుకకి చిత్ర పరిశ్రమ నుంచి కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. 

త్వరలోనే ఇంద్రజ, కార్తీక్ వివాహ వేడుకకి సంబంధించిన డేట్ ప్రకటించనున్నారు. కొత్త జంటకి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

Latest Videos

click me!