మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఇంద్ర చిత్రం ఇప్పుడు అత్యుత్తమ 4కే యూహెచ్‌డీ క్వాలిటీలో అందుబాటులోకి వచ్చేసింది. దీంతో అభిమానులు మరోసారి ఇంద్రసేనారెడ్డి మ్యానియాను ఆస్వాదించనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మరపురాని చిత్రాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇంద్ర పేరు తప్పకుండా ఉంటుంది. 2002లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో థియేటర్ల వద్ద భారీ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. హౌస్‌ఫుల్ బోర్డులతో థియేటర్లు కళకళలాడగా, ఇంద్రసేనారెడ్డి పాత్రలో చిరంజీవి చెప్పిన పవర్‌ఫుల్ డైలాగులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన డ్యాన్సులు, ముఖ్యంగా వీణ స్టెప్పు అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం చిరంజీవి స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
23
అత్యాధునిక సాంకేతికతతో 4కే రీమాస్టర్డ్ వెర్షన్
ఇప్పుడు ఈ చిత్రాన్ని కొత్త తరం ప్రేక్షకులు కూడా ఆస్వాదించేలా నిర్మాత సంస్థ వైజయంతీ మూవీస్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంద్ర చిత్రాన్ని అత్యాధునిక సాంకేతికతతో 4కే రీమాస్టర్డ్ వెర్షన్‌గా సిద్ధం చేసినట్లు సంస్థ వెల్లడించింది. పాత చిత్రాన్ని మెరుగైన విజువల్ క్వాలిటీతో అందుబాటులోకి తీసుకురావడం మెగాస్టార్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
33
ఇంద్ర ఫుల్ మూవీ 4కే యూహెచ్‌డీ వెర్షన్ యూట్యూబ్‌లో..
సరికొత్త హంగులతో కూడిన ఇంద్ర ఫుల్ మూవీ 4కే యూహెచ్‌డీ వెర్షన్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉండనున్నట్లు వైజయంతీ మూవీస్ ప్రకటించింది. థియేటర్లలో అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు యూట్యూబ్ లో అత్యుత్తమ క్వాలిటీలో చూసే అవకాశం ప్రేక్షకులకు లభించింది. చిరంజీవి అభిమానులతో పాటు అప్పట్లో ఇంద్ర మ్యానియాను ఆస్వాదించిన సినీ ప్రేక్షకులకు ఇది మరోసారి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసే సందర్భంగా మారనుంది.