మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ ఇండస్ట్రీ హిట్ మూవీ విషయంలో అప్పట్లో వివాదం జరిగింది. ఆ వివాదం విషయంలో చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల పేరు కూడా వినిపించింది. ఆ వివాదం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి గతంలో అనేక ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో నటించారు. రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు మూవీతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. కొన్నిదశాబ్దాల క్రితం చిరంజీవి నటించిన ఓ ఇండస్ట్రీ హిట్ మూవీలో నటించారు. ఆ సినిమాని నిర్మించింది ఎవరో కాదు.. చిరంజీవి స్నేహితులే. వాళ్ళు ఎవరంటే.. హారిప్రసాద్, కమెడియన్ సుధాకర్, నటుడు జివి నారాయణ రావు.
25
యముడికి మొగుడు మూవీ
వీళ్ళు ముగ్గురూ కలసి నిర్మించిన సినిమా యముడికి మొగుడు. చిరంజీవి హీరోగా, విజయశాంతి, రాధా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రవిరాజా పినిశెట్టి ఈ చిత్రానికి దర్శకుడు. వాస్తవానికినటుడు జివి నారాయణ రావు మాత్రమే ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
35
కమెడియన్ కి సాయం చేయడం కోసం..
నారాయణ రావు మాట్లాడుతూ.. యముడికి మొగుడు సినిమా నేను మాత్రమే నిర్మించాలని అనుకున్నా. కానీ చిరంజీవి గారు.. తాను కమెడియన్ సుధాకర్ కి కూడా సాయం చేయాలి అనుకుంటున్నాను అని అన్నారు. అందుకే సుధాకర్ ఈ చిత్రానికి ఓ నిర్మాత అయ్యారు. అదే క్రమంలో హరిప్రసాద్ కూడా మరో నిర్మాత అయ్యారు.
ముగ్గురం నిర్మాతలు గా ఫిక్స్ అయ్యాక చిరంజీవి గారు వాటాలు ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి ఎంత లాభం వచ్చినా ఒక్కొక్కరు 5 లక్షలు తీసుకోవాలి అని తేల్చారు. 5 లక్షలు అంటే అప్పట్లో చాలా పెద్ద మొత్తం. సినిమాకి కూడా బడ్జెట్ కోటి రూపాయలకు పైగా అయింది. అయినప్పటికీ మంచి లాభాలు వచ్చాయి. ఇచ్చిన మాట ప్రకారం చిరంజీవి గారు ముగ్గురికీ రూ 5 లక్షలు ఇచ్చారు.
55
సురేఖ పేరుపై సినిమా హక్కులు
దానికి బదులుగా యముడికి మొగుడు సినిమా హక్కులని తన భార్య సురేఖ పేరుపై రాయాలని కోరారు. దీనితో యముడికి మొగుడు సినిమా హక్కులు సురేఖ పేరుపై మారాయి. అప్పట్లో ఇది వివాదంగా మారింది. తన భార్యపై హక్కులు రాయించుకున్నారు అంటూ చిరంజీవిపై నిందలు వేశారు. చిరంజీవి గురించి తెలియని వాళ్లే అలా పుకార్లు పుట్టించారు అని జివి నారాయణ రావు తెలిపారు.