ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి రెండు చిత్రాలు విడుదలయ్యాయి. బాలయ్య, చిరు చిత్రాలు ఒకేసారి విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద ఎవరిది పైచేయి అవుతుంది ? కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనే ఉత్కంఠ ఉండేది. కానీ రెండు చిత్రాలు అద్భుత విజయం సాధించి ఇంకా వసూళ్లు రాబడుతున్నాయి.