Chiranjeevi: చిరంజీవి నటించిన ఆ చిత్రాలన్నీ ఇమేజ్‌ పెంచినా.. అన్నీ డిజాస్టర్లే..!

Published : Apr 19, 2025, 10:12 PM IST

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి తొలినాళ్లలో నటించిన పలు చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. కానీ ఆయనకు విపరీతమైన పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాయి. అంతేకాదు. తెలుగు. తమిళ్‌లో సూపర్‌ హిట్‌ అయిన సినిమా చిరంజీవి హిందీలో రీమెక్‌ చేసి ప్లాప్‌ను మూటగట్టుకున్నారు. ఆ తర్వాత బాలివుడ్‌ వైపు కన్నెత్తి చూడలేదు. అలాంటి చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

PREV
15
Chiranjeevi:  చిరంజీవి నటించిన ఆ చిత్రాలన్నీ ఇమేజ్‌ పెంచినా.. అన్నీ డిజాస్టర్లే..!
Chiranjeevi, Silk Smitha

చిరంజీవి నటించిన హిందీ సినిమాలలో ఆజ్ కా గుండా రాజ్, ప్రతిబంధ్ సినిమాలు మంచి హిట్స్. కానీ శంకర్ తమిళంలో తీసిన జెంటిల్ మేన్ సినిమా హిందీ రీమేక్‌లో చిరంజీవి నటించండం పెద్ద మైనస్‌. ముఖ్యంగా దర్శకుడు మహేష్ భట్ ఈ సినిమాకి ఏ మాత్రం న్యాయం చేయలేకపోవడం, ఈ సినిమా తర్వాత మళ్లీ చిరు బాలీవుడ్ వైపు చూడనే చూడలేదు. ముఖ్యంగా "చికుబుకు చికుబుకు రైలే" లాంటి సూపర్ హిట్ పాటలో చిరంజీవి ఎనర్జీ కనిపించినా, డ్యాన్స్ చాలా కృత్రిమంగా ఉంటుంది. హీరో ఎంత ప్రతిభావంతుడైనా, రీమేక్ సమయాలలో కొన్ని కొన్ని క్లాసిక్స్ జోలికి పోకూడదు అనే దానికి ఇదే ఉదాహరణ.
 

25
chiranjeevi

ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే, 1986 లో విడుదలైన వేట సినిమా ఆ రోజులలో హాలీవుడ్ రేంజ్ చిత్రమని అభిమానులు చెప్పుకున్నారు. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా, సినిమా కథాపరంగా పెద్ద దెబ్బ కొట్టేసింది. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ హీరోని కాదని వేరెవరినో పెళ్లి చేసుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో సినిమా పెద్దగా ఆడలేదు. బహుశా ఈ సినిమా చిరు నటించకపోయుంటే బాగుండేదేమో అని అభిమానులు భావించారు. 

 

35
Chiranjeevi, Nalini

ఇక అల్లుడా మజాకా సినిమా చిరంజీవి మాస్ ఇమేజ్‌ను పెంచుతుంది అనుకుంటే ఫలితం వేరేలా వచ్చింది. చిత్రంలోని డబుల్ మీనింగ్ డైలాగులు, కాస్త ఓవర్ యాక్షన్ సన్నివేశాలు ఎబ్బెట్టుగా ఉంటాయి. సినిమా హిట్టా. ఫట్టా అనే సంగతి పక్కన పెడితే, చిరు ఇలాంటి సినిమా చేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇవివి ఈ సినిమాకి అనుకున్నంత స్థాయిలో న్యాయం చేయలేకపోయారని ఇప్పటికీ అనిపిస్తుంది. 

45
Chiranjeevi, Sridevi

ఇక విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన జై చిరంజీవ సినిమా చాలా సాధారణమైన సినిమా. చిరు స్థాయి సినిమా అసలు కాదిది. కానీ సినిమాలో హీరోలోని కామెడీ యాంగిల్‌ను ఎక్కువగా ఎలివేట్ చేయడానికి ప్రయత్నించారు దర్శకుడు. ఇలాంటి పాత్రలు ఎందుకో చిరుకి సూట్ కాదని ఆరోజుల్లో చర్చ నడిచింది. 

 

55

అలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చేసిన చిరు.. శంకర్ దాదా జిందాబాద్ సినిమాను చేయకుండా ఉండాల్సింది. సినిమాలో గాంధీగిరి అనే కాన్సెప్టును ఎలివేట్ చేయాల్సిన దర్శకుడు.. ఎక్కడో మెసేజ్‌ను రీమేక్‌లో సరిగ్గా convey చేయలేకపోయారని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుదేవా డైరెక్టర్‌గా ఈ సినిమాకు కరెక్ట్ కాదేమో? ఒక మంచి టీమ్‌తో చిరు ఈ సినిమా చేయాల్సింది. లగేరహో మున్నాభాయ్ స్థాయిని ఈ సినిమా ఎందుకో అందుకోలేకపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories