Chiranjeevi తండ్రి నటించిన మూవీస్‌ ఏంటో తెలుసా? మెగాస్టార్‌కి ముందే సినిమా ఎంట్రీ.. అల్లు రామలింగయ్య వల్లే

Published : Mar 04, 2026, 09:52 AM IST

Chiranjeevi తండ్రి వెంకట్రావు పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. అయితే ఆయనలో నటుడు కూడా ఉన్నారు. చిరంజీవి కంటే ముందే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చారు. మరి వెంకట్రావు నటించిన సినిమాలేంటో చూద్దాం.   

PREV
15
బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చి మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి

చిరంజీవి స్వయంకృషితో నటుడిగా ఎదిగారు. మెగాస్టార్‌గా నిలిచారు. టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. చిరంజీవిది సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ కాదు, నటనలో శిక్షణ తీసుకుని, చిన్న చిన్న పాత్రలు చేస్తూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్‌గా చేసి మెప్పించారు. ఆ తర్వాత హీరోగా నిలబడ్డారు, సూపర్‌ స్టార్‌గా, మెగాస్టార్‌గా ఎదిగారు. అయితే చిరంజీవి కంటే ముందే ఆయన తండ్రి సినిమాల్లోకి వచ్చారు.  సినిమాలోనూ నటించారు.

25
చిరంజీవి కంటే ముందే తండ్రి వెంకట్రావు సినిమా ఎంట్రీ

చిరంజీవి తండ్రి వెంకట్రావుకి సంబంధించిన ప్రస్తావన చాలా తక్కువగా వస్తుంది. ఆయన పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేశారు. అయితే వెంకట్రావుకి కూడా సినిమాలంటే ఇష్టమే ఉండేది. కానీ ఆయన రాణించలేకపోయారు. ఉద్యోగానికే ప్రయారిటీ ఇచ్చారు, సినిమాలను పక్కన పెట్టారు. చిరంజీవి 1978లో సినిమా రంగ ప్రవేశం చేశారు. కానీ ఆయన తండ్రి 1969లోనే నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ ఏడాది వచ్చిన `జగత్‌ కిలాడీ` అనే చిత్రంలో వెంకట్రావు నటించారు. ఒక చిన్న పాత్రలో ఆయన కనిపించారు. ఆ తర్వాత సినిమా ఆఫర్లు వచ్చినా వెంకట్రావు ఒప్పుకోలేదు. కుటుంబ బాధ్యతల వల్ల ఆయన ఉద్యోగానికే ప్రయారిటీ ఇచ్చారు.

35
మంత్రిగారి వియ్యంకుడులో మంత్రిగా చిరంజీవి తండ్రి

తాను రాణించలేకపోవడంతో, సినిమాలు చేయలేకపోవడంతో తన కుమారుడు చిరంజీవిని సినిమాల దిశగా ఎంకరేజ్‌ చేశారు వెంకట్రావు. చిరంజీవి హీరోగా ఎంట్రీ ఇచ్చాక ఆయనతో కలిసి నటించాలని అనుకున్నారు. అది ఎప్పుడూ సాధ్యం కాలేదు. కానీ అల్లు రామలింగయ్య వల్ల సాధ్యమయ్యింది. కానీ అది సంపూర్ణం కాలేదు. చిరంజీవి నటించిన `మంత్రిగారి వియ్యంకుడు` చిత్రంలో వెంకట్రావు మంత్రిగా మెరిశారు. బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1983లో విడుదలయ్యింది. `ఖైదీ` లాంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత వచ్చిన చిత్రమిది.

45
అల్లు రామలింగయ్య వల్లనే

ఇందులో వెంకట్రావుని తీసుకోవడం వెనక చిరంజీవి మామ, హాస్యనటుడు అల్లు రామలింగయ్య హస్తం ఉంది. మంత్రి పాత్ర కోసం దర్శకుడు బాపు ఎవరితో చేయించాలనేది చూస్తుండగా, చిరు తండ్రి పేరుని సజెస్ట్ చేసింది అల్లు రామలింగయ్యనే. దీంతో బాపు ఓకే అన్నారు. ఇదే విషయంలో అటు చిరు సై అన్నారు, ఆయన తండ్రి వెంకట్రావు కూడా ఓకే చెప్పారు. అలా వెంకట్రావు మళ్లీ `మంత్రిగారి వియ్యంకుడు` చిత్రంలో నటించారు. అయితే ఇందులో చిరంజీవి, ఆయన తండ్రి కలిసి నటించినా, ఇద్దరి మధ్య సన్నివేశాలు లేకపోవడం బాధాకరం. మంచి సీన్లు ఉంటే అవి ఎప్పటికీ మెగా ఫ్యామిలీకి ఒక మెమొరీగా మిగిలిపోయేవి. మొత్తంగా చిరంజీవి తండ్రి `జగత్‌ కిలాడీ`, `మంత్రిగారి వియ్యంకుడు` చిత్రాల్లో నటుడిగా మెరిశారని చెప్పొచ్చు.

55
చిరంజీవి సినిమాలు

చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఇది రీజినల్‌ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆయన బాబీ దర్శకత్వంలో సినిమాకి రెడీ అవుతున్నారు. అలాగే `విశ్వంభర` మూవీ విడుదలకు రెడీ అవుతుంది. జులైలో దీన్ని రిలీజ్‌ చేయబోతున్నారు. మరోవైపు శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది చిరంజీవి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories