శ్రీకాంత్ ఓదెల సినిమాకు చిరంజీవి స్టన్నింగ్ రెమ్యునరేషన్

First Published | Jan 3, 2025, 2:49 PM IST

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి చిరంజీవి రెమ్యునరేషన్ ₹75 కోట్లుగా ఖరారైంది. ఈ సినిమా నాని సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం 90ల నాటి గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో ఉంటుంది.

Chiranjeevi, Remuneration, Srikanth Odela

చిరంజీవితో (Chiranjeevi)  శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela)కాంబినేషన్ లో  ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ గా అయితే ఇది ఓ సీనియర్‌ స్టార్‌ హీరో – యంగ్‌ డైరెక్టర్‌ సినిమా గా పిలిచేవారు. అయితే  శ్రీకాంత్‌ ఓదెల కు ఉన్న క్రేజ్ తో ఈ సినిమా నెక్ట్స్ లెవిల్ కు వెళ్లింది. దానికి తోడు ఆయన చిరంజీవికి ఫ్యాన్‌ కావడంతో  ఈ సినిమా పై ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి.  

అందులోనూ ఈ సినిమాలో చిరంజీవి గ్యాంగస్టర్ గా రెట్రో స్టైల్ లో  కనిపించబోతున్నారు. ఇవన్నీ చూస్తూంటే   పవన్‌ కల్యాణ్‌  (Pawan Kalyan) – సుజీత్‌ (Sujeeth) ‘ఓజీ’ (OG Movie) సినిమాకు వచ్చిన క్రేజ్‌ దీనికీ వస్తోందని ట్రేడ్ అంటోంది. అంతాబాగానే ఉంది చిరంజీవి ఈ ప్రాజెక్టు నిమిత్తం ఎంత తీసుకోబోతున్నారు అనేది హాట్ టాపక్ గా మారింది. 

Srikanth Odela Chiranjeevis upcoming film updates out

మెగాస్టార్ గా చిరంజీవి రెమ్యునరేషన్ ఎప్పుడూ పై స్దాయిలోనే ఉంది. ఈ ఏజ్ లోనూ యంగ్ హీరోలకు థీటుగా ‘ఖైదీ నెంబ‌ర్ 150’, ‘వాల్తేరు వీరయ్య‌’వంటి సూపర్ హిట్స్ ఇవ్వటంతో ఆయనకు మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తాజాగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న  ‘విశ్వంభ‌ర‌’ చిత్రానికి రూ.60 కోట్ల పారితోషికం అందుకొన్న‌ట్టు తెలుస్తోంది.

ఇక శ్రీకాంత్ ఓదెల చిత్రానికి  ఇప్పుడు ఆయ‌న పారితోషికం రూ.75 కోట్ల‌కు చేరుకొందని వినికిడి. సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాత‌.  అయితే ఇక్కడ చిన్న మెలిక ఏమిటంటే... విశ్వంభ‌ర – శ్రీ‌కాంత్ ఓదెల సినిమాల మ‌ధ్య చిరు మ‌రో సినిమా చేస్తారు. దీనికి అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకు రెమ్యనరేషన్  ఎంత‌న్న‌ది తేలాలి.


శ్రీకాంత్ ఓదెల చిత్రం విషయానికి వస్తే... స్టార్ హీరో నాని ఈ చిత్రాన్ని సమర్పిస్తూ, సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఇప్పటికే ఎగ్రిమెంట్స్ అన్ని పూర్తయ్యాయి.  ప్రొడక్షన్ టీమ్ చిరంజీవి రెమ్యునరేషన్, రూల్స్ ని ఓకే చేసింది.   ₹75 కోట్లు చెల్లించడానికి ఓకే చెప్పి అడ్వాన్స్ పే చేసింది. అఫీషియల్ గా ప్రాజెక్ట్‌ను లాక్ చేసి ప్రకటించడం జరిగింది.

read more: బాలకృష్ణ ఊర్వశి బట్టలు ఉతుకుతున్నాడా? `డాకు మహారాజ్‌` సాంగ్‌, శేఖర్‌ మాస్టర్‌పై క్రేజీ ట్రోల్స్
 

director Srikanth Odela


ప్రస్తుతం, శ్రీకాంత్ ఒదెల నానితో ది ప్యారడైజ్‌కి దర్శకత్వం వహిస్తున్నాడు, అయితే నాని ...శైలేష్ కొలను దర్శకత్వంలో HIT 3 చిత్రీకరణలో బిజీగా ఉన్నందున షూటింగ్ వాయిదా పడింది. శ్రీకాంత్ ది ప్యారడైజ్‌ను పూర్తి చేసిన తర్వాతే చిరంజీవి ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది.

శ్రీకాంత్ ఓదెల యొక్క తొలి చిత్రం దసరా భారీ విజయాన్ని సాధించింది, నానిని కొత్త గా చూపించారు. దాంతో చిరంజీవితో శ్రీకాంత్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి లాంటి లెజెండ్‌ని తన మూడవ సినిమాకే  డైరెక్ట్ చేయడం చిన్న ఫీట్ కాదు, చాలా పెద్ద భాధ్యతే శ్రీకాంత్ పై ఉంది.

Nani, Srikanth Odela, Dasara, Paradise

 
శ్రీకాంత్ ఓదెలతో  చిరంజీవి చేసే చిత్రం 90ల నాటి గ్యాంగ్‌స్టర్ డ్రామా. చిరంజీవి తన వయసుకు తగిన పాత్రను పోషించనున్నారు మరియు ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ చిత్రం విడుదలైంది,

ఇది మెగాస్టార్  యంగ్ ఫ్యాన్స్ ని  ఆనందపరుస్తోంది. ఏదైమైనా  సీనియ‌ర్ హీరోల్లో అత్య‌ధిక పారితోషికం తీసుకొంటోంది చిరంజీవి మాత్ర‌మే. చిరు, నాగ్‌, బాల‌య్య‌, వెంకీ.. ఈ బ్యాచ్ లో ముందు నుంచీ రెమ్యునరేషన్ విష‌యంలో చిరుదే అగ్ర తాంబూలం. ఈ జ‌న‌రేష‌న్‌లోనూ అదే టెంపో కొన‌సాగుతోంది. 

Srikanth Odela


శ్రీ‌కాంత్ ఓదెల చిరంజీవిని ఎలా చూపించ‌బోతున్నాడ‌న్న ఆస‌క్తి అంద‌రిలోనూ వుంది. ఈ సినిమా క‌థ `విక్ర‌మ్‌` స్టైల్ లో ఉంటుంద‌ని, చిరుని ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ చూడ‌ని ఓ న‌యా అవ‌తార్‌లో తీర్చిదిద్ద‌బోతున్నాడ‌ని టాక్‌. కేవ‌లం సింగిల్ సిట్టింగ్ లో ఈ క‌థ ఓకే అయిపోయింది. చిరు ద‌గ్గ‌ర సింగిల్ సిట్టింగ్ లో క‌థ ఓకే అవ్వ‌డం అంటే మామూలు విష‌యం కాదు.  అలాంటిది శ్రీ‌కాంత్ ఓదెల ఇలా వెళ్లి, అలా ఓకే చేయించుకొని వ‌చ్చేశాడు. ప్ర‌స్తుతం నానితో `ప్యార‌డైజ్` తెర‌కెక్కిస్తున్నాడు శ్రీ‌కాంత్. ఆ త‌ర‌వాతే… చిరు సినిమా ప‌ట్టాలెక్కుతుంది.

read more: అత్యధిక వసూళ్లని రాబట్టిన టాప్‌ 8 రామ్‌ చరణ్‌ సినిమాలు

Latest Videos

click me!