Chiranjeevi Top 10 Movies: తప్పక చూడాల్సిన చిరంజీవి బెస్ట్ టాప్‌ 10 మూవీస్.. మెగాస్టార్‌ ఏంటో చూపించే సినిమాలు

Published : Aug 22, 2026, 12:36 PM IST

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న చిరంజీవి కెరీర్‌లో బెస్ట్ మూవీస్‌, ఆయన్ని ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన టాప్‌ 10 మూవీస్‌ ఏంటో తెలుసుకుందాం. ఇవి చూస్తే ఆయనేంటో తెలిసిపోతుంది.

PREV
111
చిరంజీవి కెరీర్‌ బెస్ట్ టాప్‌ 10 మూవీస్‌

మెగాస్టార్‌ చిరంజీవి నేడు శనివారం(ఆగస్ట్ 22)తన 71వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్‌ తెలియజేస్తున్నారు. అభిమానులు అయితే ఒక్క రోజు ముందు నుంచే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఈ రోజంతా మెగా అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. చిరంజీవి నటుడిగా ఏంటనే చెప్పడానికి చాలా సినిమాలున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం టాప్‌లో ఉంటాయి. నటుడిగా తానేంటో నిరూపించే చిత్రాలు, తన బాక్సాఫీసు స్టామినాని చూపించిన చిత్రాలు, విమర్శకుల ప్రశంలందుకున్న చిత్రాలను మేళవిస్తే వచ్చిన టాప్‌ 10 మూవీస్‌ ఏంటో చూద్దాం.

211
1.ఇంద్ర

చిరంజీవి తన కెరీర్‌లో 156 సినిమాలు చేశారు. ఇందులో టాప్‌ 10 తీయడం కష్టమే. కానీ సక్సెస్‌, కథా బలం, నటన, ప్రశంసలు ఇలాంటి అన్ని యాంగిల్స్ లో చూసినప్పుడు ఐఎండీబీ రిపోర్ట్ ప్రకారం `ఇంద్ర` మూవీ మొదటి స్థానంలో ఉంది. దీనికి బి గోపాల్‌ దర్శకత్వం వహించగా, ఇందులో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు. 2002లో విడుదలైన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. ఇది చిరంజీవి బాక్సాఫీసు రేంజ్‌కి ప్రతిబింబంగా నిలుస్తుంది. తప్పక చూడాల్సిన చిత్రాల్లో జాబితాలో చేరుతుంది.

311
2.రుద్ర వీణ

చిరంజీవిని నటుడిగా వేరే స్థాయికి తీసుకెళ్లిన మూవీ `రుద్రవీణ`. కే బాలచందర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మ్యూజికల్‌ డ్రామాలో శోభన హీరోయిన్‌గా నటించింది. జెమినీ గణేషన్‌ తండ్రి పాత్రని పోషించారు. విమర్శల 1988లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. మూడు జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఇందులో చిరంజీవి నటనకు వాహ్‌ అనాల్సిందే. చిరంజీవి యాక్టింగ్‌కి, అగ్రెసివ్‌నెస్‌కిదొక కొలమానంగా నిలుస్తుంది.

411
3.ఠాగూర్‌

చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌లో `ఠాగూర్‌` ఒకటి. అవినీతి, లంచంపై చేసిన చిత్రమిది. వివి వినాయక్‌ దర్శకుడు. ఇందులో జ్యోతిక, శ్రియా హీరోయిన్లుగా నటించారు. లంచంపై ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి చిరంజీవి చేసిన పోరాటమే ఈ మూవీ. 2003లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపింది. బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిపింది. ఇందులో పాటలు హైలైట్‌గా నిలుస్తాయి. వీణ స్టెప్‌ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్‌. ఇందులో `నేనుసైతం` పాట రాసిన సుద్దాల అశోక్‌ తేజకి జాతీయ అవార్డు వరించింది. ఇది చిరంజీవి చేసిన చిత్రాల్లో ఆలోచింప చేసే మూవీ అవుతుంది.

511
4.జగదేక వీరుడు అతిలోక సుందరి

1990లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో ఒక సునామీ సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్‌ ప్రభావం చూపిస్తే, థియేటర్లలో ఈ సినిమా సునామీ సృష్టించింది. తుఫాన్‌ని కూడా లెక్క చేయకుండా ఈ సినిమాని చూశారు ఆడియెన్స్. కె రాఘవేంద్రరావు రూపొందించిన ఈ ఫాంటసీ మూవీలో అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్‌గా నటించడం విశేషం. ఆ టైమ్‌లో ఇది ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం విశేషం. ఇందులో చిరంజీవి కామెడీ, నటన, డాన్సులు, పాటలకు ఫిదా అయిపోతారు.

611
5.స్వయంకృష్ణ

చిరంజీవి కమర్షియల్‌ హీరో మాత్రమే అనే ట్యాగ్‌ వచ్చిన నేపథ్యంలో అద్భుతమైన నటుడు కూడా అని నిరూపించిన చిత్రం `స్వయంకృషి`. ఇందులో విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. సినిమాలో చిరంజీవి చెప్పులు కుట్టేవాడిగా కనిపించారు. దీనికి కె విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. 1987లో ఈ మూవీ విడుదలైంది. పెద్ద హిట్‌ అయ్యింది. డబ్బుల కంటే ప్రశంసలు ఎక్కువగా రావడం విశేషం. నటుడిగా చిరంజీవి గర్వపడే మూవీగా నిలిచింది. ఇందులో చిరు నటనకు ఫిదా అవ్వాల్సిందే.

711
6.శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌

2004లో విడుదలైన యాక్షన్‌ కామెడీ చిత్రమిది. హిందీలో వచ్చిన `మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌` మూవీకిది రీమేక్‌. జయంత్‌ సీ పరాంజీ దర్శకత్వం వహించారు. ఇందుో సోనాలి బింద్రే హీరోయిన్‌గా నటించగా, శ్రీకాంత్‌ సెకండ్‌ లీడ్‌ చేశారు. ఈ మూవీ చిరంజీవిలోని కామెడీని కొత్తగా ఆవిష్కరించింది. ఆయన నవ్విస్తూ, ఏడిపించిన తీరు బాగుంటుంది. అందుకే ఆడియెన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. 2004లో విడుదలైన ఈ మూవీ మంచి ఆదరణ పొందింది.

811
7.గ్యాంగ్‌ లీడర్‌

చిరంజీవిని మాస్‌ హీరోగా నిలబెట్టిన చిత్రాల్లో `గ్యాంగ్‌ లీడర్‌` ఒకటి. ఆయన డైలాగ్‌ డెలివరీ, యాక్షన్‌, యాక్టింగ్‌ పరంగా వాహ్‌ అనిపిస్తుంది. తన స్టయిల్‌, మ్యానరిజానికి ఇదొక రిఫరెన్స్ గా నిలుస్తుంది. ఈ మూవీ స్పూర్తితోనే ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయని చెప్పొచ్చు. తాజాగా కొత్త మూవీ `కాకా`లోనూ ఈ మూవీలోని పాటనే బీజీఎంగా వాడటం విశేషం. `గ్యాంగ్‌ లీడర్‌` చిత్రానికి విజయ బాపినీడు దర్శకత్వం వహించారు, విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. 1991లో విడుదలైన ఈ యాక్షన్‌ క్రైమ్‌ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో చిరంజీవిలోని అన్ని యాంగిల్స్ చూడొచ్చు. చిరంజీవి మూవీస్‌లో ఇది అస్సలు మిస్‌ అవ్వదు.

911
8.విజేత

ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. అల్లు అరవింద్‌ నిర్మాత. భానుప్రియా హీరోయిన్‌గా నటించింది. ఒక ఫుట్‌ బాల్‌ ఆటగాడు ఇంటా బయట అనేక సవాళ్లని ఎదుర్కొని జీవితంలో, ఆటలో ఎలా విజయాన్ని సాధించారనే కథతో రూపొందిన చిత్రమిది. 1985లో విడుదలై విశేష ఆదరణ పొందింది. నటుడిగా చిరంజీవికి మంచి పేరుని తీసుకొచ్చింది. చిరంజీవి మూవీస్‌లో తప్పక చూడాల్సిన చిత్రాల జాబితాలో చేరింది.

1011
9.సైరా నరసింహారెడ్డి

స్వాతంత్య్రం కోసం పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎపిక్‌ హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామా చిత్రమిది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో చిరంజీవి సైరా నరసింహారెడ్డిగా నటించారు. ఆయనతోపాటు అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, తమన్నా, నయనతార వంటి వారు నటించారు. 2019లో విడుదలైన ఈ మూవీ ప్రశంసలందుకుంది. చిరంజీవి నటనకు ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్‌గా పెద్దగా మెప్పించలేకపోయింది. కాకపోతే చిరంజీవి మూవీస్‌లో తప్పక చూడాల్సిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

1111
10.ఖైదీ

చిరంజీవి రేంజ్‌ ఏంటో, నటుడిగా ఆయన స్టామినా ఏంటో, బాక్సాఫీసు వద్ద ఆయన రేంజ్‌ ఏంటో చూపించిన చిత్రం `ఖైదీ`. టాలీవుడ్‌లో బిగ్‌ బ్రేక్ ఇచ్చింది. నటుడిగా ఆయన్ని ఒకేసారి పది మెట్లు ఎక్కించిన చిత్రమిది. కమర్షియల్‌గానూ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. అదిరిపోయే కథ, పాటలు, డాన్సులు ఈ మూవీకి హైలైట్‌గా నిలిచాయి. ఇందులో మాధవి హీరోయిన్‌గా నటించింది. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ మూవీ చిరంజీవికి ఫస్ట్ బ్రేక్‌ ఇచ్చింది. ఆయన్ని స్టార్‌ని చేసింది. ఇది చిరంజీవి మూవీస్‌లో ఫస్ట్ చూడాల్సిన చిత్రంగా చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories