VAS 8 Days Collections: ఫ్రైడే పుంజుకున్న విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ కలెక్షన్లు.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?

Published : Aug 22, 2026, 10:06 AM IST

VAS 8 Days Collections: కోలీవుడ్‌ హీరో సూర్య తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో చేసిన `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతోంది. ఈ చిత్రానికి గురువారంతో పోల్చితే, శుక్రవారం కలెక్షన్లు పెరగడం విశేషం.

PREV
14
శుక్రవారం పెరిగిన కలెక్షన్లు

సూర్య లేటెస్ట్ గా మరో హిట్‌ తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఆయన `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` మూవీతో విజయాన్ని అందుకున్నారు. గత వారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యింది. దీంతో వారు సినిమాని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ 8 రోజులు పూర్తి చేసుకుంది. ఈ శుక్రవారం కొత్త సినిమాలు వచ్చాయి. అయినా ఈ మూవీ కలెక్షన్లు తగ్గలేదు సరికదా, శుక్రవారం పెరగడం విశేషం.

24
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ 8 రోజుల కలెక్షన్లు

`విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` మూవీకి ఎనిమిదో రోజు రూ.4.50కోట్లు వచ్చాయి. గురువారం రూ.4.20కోట్లు రాగా, ముప్పై లక్షలు పెరగడం విశేషం. వీకెండ్స్ లో ఈ మూవీ పుంజుకుంటుందనేదానికిది నిదర్శనం. ఇక 8 రోజుల్లో ఈ చిత్రం మొత్తంగా రూ.149.77కోట్లు రాబట్టింది. ఆల్మోస్ట్ 150కోట్ల క్లబ్‌లో చేరింది. ఇండియాలో దీనికి రూ.99.52కోట్ల గ్రాస్‌ రాగా, రూ.86.10కోట్ల నెట్‌ కలెక్షన్లు వచ్చాయి. ఎనిమిదో రోజు ఓవర్సీస్‌లో కోటిన్నర రాబట్టింది. మొత్తంగా అక్కడ రూ.50.26కోట్లు వసూలు చేయడం విశేషం.

34
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

ఈ సినిమాకి తమిళంలో కంటే తెలుగులోనే కలెక్షన్లు ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. 8వ రోజు కూడా తమిళంలో రూ.1.85కోట్లు వస్తే, తెలుగులో రూ.2.40కోట్లు రావడం విశేషం. ఓవరాల్‌ కలెక్షన్లలో కూడా తమిళం కంటే తెలుగులోనే ఎక్కువగా ఉండటం మరో విశేషం. ఇక ఈ చిత్రానికి రూ.130కోట్ల బడ్జెట్‌ అయ్యింది. సుమారు రూ.90కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యిందట. ఈ లెక్కన సినిమా హిట్‌ కావాలంటే రూ.180కోట్ల గ్రాస్‌ రావాలి. ఇప్పటికే రూ.150కోట్లు దాటింది. ఈ వచ్చే వారంలో ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ అయ్యే ఛాన్స్ ఉంది.

44
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ కథ ఇదే

ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` చిత్రంలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్ గా నటించింది. రాధికా శరత్‌ కుమార్‌, రవీనా టండన్‌, వైవా హర్ష, సునీల్‌ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీ ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో సూర్య బిగ్‌ షాట్‌. ఆయనకు పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు. కానీ అమ్మ రాధికా మాత్రం.. కొడుక్కి పెళ్లి చేయాలని కోరుకుంటుంది. పిల్లల కోసం ఫారెన్‌ వెళ్లి సరోగసి ద్వారా ఒక పిల్లాడిని కంటాడు సూర్య. కానీ చిన్నోడికి చిన్న అనారోగ్య సమస్య వస్తుంది. దీంతో సరోగసి మమ్మి రావాల్సి వస్తుంది. ఆమెనే మమితా బైజు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories