రామ్‌ చరణ్‌కి ఆ విషయంలో చిరంజీవి కండీషన్‌, దొంగతనంగా ఆ పని చేసిన చెర్రీ, కట్‌ చేస్తే బ్రాండ్‌ అంబాసిడర్‌

చిన్నప్పుడు కొడుకు రామ్‌ చరణ్‌కి పెద్ద కండీషనే పెట్టాడు నాన్న చిరంజీవి. ఇంట్లో దానికి అలో లేదట. దీంతో దొంగతనంగా ఆ పని చేసినట్టు వెల్లడించారు చరణ్‌. 
 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఫ్యాన్స్ ఆయన్ని గ్లోబల్‌ స్టార్‌గా పిలుస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` తో రామ్‌ చరణ్‌ ఇంటర్నేషనల్‌ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

`ఆస్కార్‌` ప్రమోషన్స్ లో భాగంగా ఆయన అంతర్జాతీయ మీడియాతో ముచ్చటించి తన క్రేజ్‌ని పెంచుకున్నారు. పలు అంతర్జాతీయ వేదికల్లో పాల్గొంటూ తన రేంజ్‌ని పెంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్‌ని కొనసాగిస్తున్నారు. 

రామ్‌ చరణ్‌ చిన్నప్పట్నుంచి గోల్డెన్‌ స్ఫూన్‌తో పెరిగాడనేది అందరికి తెలిసిన నిజమే. మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు కావడంతో ఆ లగ్జరీ చిన్నప్పట్నుంచే పొందే అవకాశం ఉంది. ఏది కావాలంటే అది ఆయనకు దక్కుతుంది. అవసరాలకు, లగ్జరీ మెయింటనెన్స్ కి లిమిట్స్ ఏం లేవు.

కానీ చిన్నప్పట్నుంచి కొన్ని విషయాల్లో మాత్రం స్టిక్ట్ రూల్స్ పెట్టారట చిరంజీవి. వాటి జోలికే వెళ్లడానికి లేదట. ఫ్యామిలీ మొత్తం ఈ విషయాన్ని పాటించాలి, చరణ్‌ని కంట్రోల్‌ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఇంట్లోనూ అవి లేకుండా చేశాడట. 
 


మరి రామ్‌ చరణ్‌కి చిరంజీవి పెట్టిన కండీషన్‌ ఏంటనేది చూస్తే.. బైక్‌ డ్రైవ్ చేయకూడదని చిరంజీవి స్టిక్ట్ గా చెప్పారట చరణ్‌ కి. ఎట్టిపరిస్థితుల్లోనూ బైక్‌ నడపకూడదని చెప్పారట. ఫ్యామిలీ అంతటిలోనూ ఈ కండీషన్‌ ఉండేదట. అంతేకాదు ఇంట్లో బైక్‌లు కూడా ఉండేవి కావట. దీంతో చరణ్‌కి కాళ్లు కట్టుకుని కూర్చునే పరిస్థితి.

ఫ్రెండ్స్ అంతా బైక్‌లపై షికారుకి వెళ్తుంటే చరణ్‌ మాత్రం ఇంట్లోనే ఉండాల్సి వచ్చేదట. అయితే బయటకు వెళితే కారుని తీసుకునే ఫెసిలిటీ ఉంది. కానీ బైక్‌ పై వెళ్లిన మజా కారు ఇవ్వదు. అందుకే ఇక ఆపుకోలేక రామ్‌ చరణ్‌ కండీషన్స్ ని, రూల్స్ బ్రేక్‌ చేశాడట. 
 

బైకులు ఇంట్లో లేకపోవడంతో ఫ్రెండ్స్ వద్దకు వెళ్లినప్పుడు వాళ్ల బైకులు తీసుకుని డ్రైవ్‌ చేసేవాడట. దొంగతనంగా ఆ పని చేసినట్టు తెలిపారు చరణ్‌. ఇంట్లో తెలియకుండా చేశాడట. ఈ విషయాన్ని ఇటీవలే ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు వరకు సొంతంగా బైక్‌ లేదని చెప్పాడు. రామ్‌ చరణ్‌ హీరో (గ్లామర్‌) బైక్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు.

ఈ కొత్త బైక్‌ లాంఛింగ్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ ఈ విషయాన్ని షేర్‌ చేసుకున్నారు. బైక్‌ ఎప్పట్నుంచి రైడ్‌ చేశారనే ప్రశ్నకి ఈ విషయాన్ని వెల్లడించారు చరణ్‌. ఇప్పుడు హీరో బైక్ కి బ్రాండ్‌ అంబాసిడర్‌ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం చరణ్‌ కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

రామ్‌ చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత `ఆచార్య` చిత్రంలో మెరిశారు. చిరంజీవి హీరోగా రూపొందిన ఈ మూవీ ఆడలేదు. ప్రస్తుతం ఆయన `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. డిసెంబర్‌లో క్రిస్మస్‌ కానుకగా విడుదల కాబోతుంది.

ఇందులో చెర్రీకి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్‌, ఎస్‌ జే సూర్య, అంజలి, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. దిల్‌ రాజు సుమారు 350కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. 
 

Latest Videos

click me!