Chiranjeevi-Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా? టాలీవుడ్‌లోనే అదొక సంచలనం

Published : Mar 24, 2026, 08:47 PM IST

చిరంజీవి, బాలకృష్ణ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే, ఇద్దరు కలిసి సినిమా చేస్తే అభిమానులకే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే అదొక అరుదైన చిత్రంగా నిలుస్తుంది. కానీ 40 ఏళ్ల క్రితమే ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. 

PREV
15
చిరంజీవి, బాలయ్య కాంబినేషన్‌ కోసం ఇండస్ట్రీ ఎదురుచూపు

మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ కలిసి నటిస్తే చూడాలని వారిద్దరి అభిమానులే కాదు, చిత్ర పరిశ్రమతోపాటు కామన్‌ ఆడియెన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి నటిస్తే నిజంగానే అదొక అరుదైన చిత్రం. అదే సమయంలో సంచలనాత్మక మూవీ అవుతుంది. ఆ మధ్య బాలయ్య 50ఏళ్ల సెలబ్రేషన్‌ సమయంలో తనకు, బాలయ్య కాంబినేషన్‌ ఒక సినిమా ప్లాన్‌ చేయాలని ఇండస్ట్రీకి పిలుపునిచ్చారు చిరంజీవి. పలువురు దర్శకులకు కూడా చెప్పారు. ఆయన సరదాగానే చెప్పినా, అది నిజం అయితే మాత్రం సెన్సేషనల్‌ మూవీ అవుతుందని, చూడ్డానికి రెండు కళ్లు చాలవని చెప్పొచ్చు.

25
39ఏళ్ల క్రితం కలిసి నటించిన చిరు, బాలయ్య

అయితే ఈ ఇద్దరు కలిసి నటించడం సాధ్యమా అంటే చెప్పలేం. భవిష్యత్‌లో జరిగినా జరగొచ్చు. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. కానీ ఇలాంటి అరుదైన సంఘటన, ఇలాంటి అరుదైన మూవీ ఒకటి ఇప్పటికే వచ్చింది. చిరంజీవి, బాలకృష్ణ కలిసి ఒక సినిమాలో నటించారు. ఈ ఇద్దరు కాసేపు తళుక్కున మెరిశారు. వీరిద్దరే కాదు, అప్పటి టాప్‌ హీరోలంతా ఇందులో కనిపించడం విశేషం. ఇలాంటి అరుదైన సంఘటన దాదాపు 39ఏళ్ల క్రితమే చోటు చేసుకుంది. స్టార్‌ హీరోలు, హీరోయిన్లు ఒకే సినిమాలో మెరిశారు.

35
టాలీవుడ్‌ టాప్‌ హీరోలంతా కలిసిన నటించిన చిత్రమిదే

చిరంజీవి, బాలకృష్ణతోపాటు విక్టరీ వెంకటేష్‌, కింగ్‌ నాగార్జున, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చంద్రమోహన్‌, మురళీ మోహన్‌, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, విజయశాంతి, రాధ, భాను ప్రియ, రాధికతోపాటు శారద, జయమాలిని, అనురాధ, వై విజయ వంటి వారు గెస్ట్ లుగా మెరిశారు. ఆ సినిమానే `త్రిమూర్తులు`. వెంకటేష్‌, అర్జున్‌, రాజేంద్రప్రసాద్‌ హీరోలుగా చేశారు. కె మురళీ మోహన్‌రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1987లో విడుదలైంది.

45
అంతా కలిసి చేసినా నిరాశ తప్పలేదు

ఇన్నేళ్ల కెరీర్‌లో టాప్‌ స్టార్స్ నటించిన ఒకే ఒక సినిమా `త్రిమూర్తులు`గా చెప్పొచ్చు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్‌, నాగార్జున వంటి టాప్‌ హీరోలు కలిసి నటించిన మూవీ కూడా ఇదొక్కటే. కానీ ఇది పెద్దగా ఆడలేదు. భారీ కాస్టింగ్‌ ఉన్నా సినిమాలో విషయం లేకపోవడంతో పరాజయం చెందింది. ఇది హిందీలో వచ్చిన `నసీబ్‌` చిత్రానికి రీమేక్‌. అక్కడ మంచి విజయం సాధించింది. కానీ తెలుగులో డిజాస్టర్‌గా నిలిచింది.

55
చిరంజీవి, బాలయ్య సినిమాల అప్‌ డేట్స్

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే, ఆయన ఈ ఏడాది సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇది బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇది ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ముంబాయి మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించనుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories