స్పెషల్ అట్రాక్షన్ గా కేతమ్మ
బిగ్ బాస్ 'అగ్నిపరీక్ష' ఫస్ట్ ఎసిపోడ్ లో ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్లు స్టేజ్ పై సందడి చేశారు.అందులో గంగవ్వ వయసున్న కేతమ్మ ఈ ఎపిసోడ్ కే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తలపై బోనం ఎత్తుకుని ఆమె ఎంట్రీ అదిరిపోయింది. నల్లగొండ దగ్గర తొండ తిరుమలగిరి తమ ఊరని చెపుతూనే ‘’ కష్టపడ్డ సార్.. నా చిన్నబిడ్డ నన్ను నా భర్తని సాకుతది.. నా భర్తకి పక్షవాతం వచ్చింది సార్.. ఈ జన్మకి నాకు ఇంతే చాలు, మిమ్మల్ని అందర్నీ కలిసిన''.. అంటూ కేతమ్మ చెప్పిన మాటలు అందర్నీ ఆకర్షించాయి. జీవితంలో అన్నీ కష్టాలు చూశానని, అందరిని నవ్వించడం తనకు ఇష్టం అనిచెప్పింది కేతమ్మ.