సమంతకి సోకిన వ్యాధిపై చిరు, నాగబాబు ఎమోషనల్ కామెంట్స్.. మరోవైపు నాగార్జునపై రూమర్స్

Published : Oct 31, 2022, 09:56 AM IST

ఇండస్ట్రీకి పరిచయమైన తక్కువ కాలంలోనే తన ప్రతిభతో సమంత స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సమంత సౌత్ లోనే తిరుగులేని స్టార్ హీరోయిన్. జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా ఆమె జోరు తగ్గడం లేదు. 

PREV
17
సమంతకి సోకిన వ్యాధిపై చిరు, నాగబాబు ఎమోషనల్ కామెంట్స్.. మరోవైపు నాగార్జునపై రూమర్స్

ఇండస్ట్రీకి పరిచయమైన తక్కువ కాలంలోనే తన ప్రతిభతో సమంత స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సమంత సౌత్ లోనే తిరుగులేని స్టార్ హీరోయిన్. జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా ఆమె జోరు తగ్గడం లేదు. కానీ ప్రస్తుతం సమంతకు విధి ఆరోగ్య సమస్యల రూపంలో మరో సవాల్ విసిరింది. 

 

27

సమంత సోషల్ మీడియాలో తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించగానే చిత్ర పరిశ్రమ ఒక్క సరిగా ఉలిక్కి పడింది. అభిమానులు షాక్ లో ఉన్నారు. ఆమె ప్రస్తుతం మయోసైటిస్ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతోంది. సమంత దాదాపుగా కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. అయితే పూర్తిగా కోలుకోవడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. 

37

దీనితో సమంతకి మనో ధైర్యాన్ని ఇస్తూ అభిమానులు, సెలెబ్రిటీలు వరుసగా పోస్ట్ లు పెడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఎన్టీఆర్, అఖిల్, సాయిధరమ్ తేజ్, సుశాంత్, కాజల్, రాశి ఖన్నా లాంటి సెలెబ్రిటీలు ఇప్పటికే సమంత వ్యాధిపై స్పందించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు సమంత వ్యాధిపై స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

47

డియర్ సమంత.. జీవితంలో తరచుగా మనకు సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని అధికమించి క్రమంలో మన బలం పెరుగుతుంది. నీవు అద్భుతమైన అమ్మాయివి. ఈ ఛాలెంజ్ ని అధికమించి ఇన్నర్ స్ట్రెంత్ నీలో ఉంది. నీకు మరింత బలం చేకూరాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 

57

మెగా బ్రదర్ నాగబాబు కూడా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నేరుగా సమంతతో నాకు పరిచయం లేదు. ఆమె మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది అని తెలిసినప్పటి నుంచి నా హృదయం ద్రవించింది. సమంత ఈ వ్యాధి నుంచి వేగంగా కోలుకుని మునుపటికంటే బలంగా తిరిగి రావాలి. ఈ తరం గొప్ప నటీమణుల్లో సమంత ఒకరు. ఆమె భవిష్యత్తులో మరిన్ని గొప్ప పాత్రలు చేయాలి. 

 

67
Samantha

ఇదిలా ఉండగా అక్కినేని కుటుంబ సభ్యులు కూడా సమంత త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు. అఖిల్ ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో సమంత త్వరగా కోలుకోవాలని పోస్ట్ చేశాడు. సుశాంత్ కూడా స్పందించారు. కింగ్ నాగార్జున సమంతని పర్సనల్ గా కలవడం కానీ, ఫోన్ లో పరామర్శించడం కానీ చేయబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతుందో తెలియాల్సి ఉంది. గత ఏడాది సామ్, చైతు విడాకులతో విడిపోయిన సంగతి తెలిసిందే. 

77

సమంత ప్రస్తుతం యశోద, ఖుషి, శాకుంతలం , వరుణ్ ధావన్ తో ఒక వెబ్ సిరీస్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. సమంత పేరుపై ప్రస్తుతం వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది. 

click me!

Recommended Stories