సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ కి హీరో అతడే, వెంకటేష్ చేసిన కామెడీ ఆయన చేయగలరా ?

Published : Oct 13, 2025, 01:52 PM IST

Sankranthiki Vasthunnam Movie: వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం హిందీలో రీమేక్ అవుతోంది. అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనున్నారు.

PREV
15
2025 బిగ్గెస్ట్ హిట్ గా సంక్రాంతికి వస్తున్నాం 

వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో భారీ విజయాన్ని సాధించింది. 2025లో ఈ చిత్రం టాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ చిత్రం ద్వారా చాలా ఏళ్ల తర్వాత వెంకటేష్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను తెచ్చుకుంది.

25
హిందీ రీమేక్ కి హీరోగా అక్షయ్ కుమార్ 

ఇప్పుడు ఈ హిట్ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజా సమాచారం ప్రకారం, సంక్రాంతికి వస్తున్నాం చిత్రం హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అక్షయ్ కుమార్ ఈ మూవీలో నటించడం దాదాపు ఖాయం అని దిల్ రాజు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. 

35
వెంకటేష్ లాగా చేయగలరా ?

దిల్ రాజు నిర్మించిన ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులు ఆయన దగ్గరే ఉన్నాయి. అక్షయ్ కుమార్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ చూశారట. వెంటనే దిల్ రాజుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ కామెడీ టైమింగ్ కూడా బావుంటుంది. ఒరిజినల్ సినిమా చూసిన తర్వాత రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అక్షయ్ కుమార్ గతంలో చాలా చిత్రాల్లో కామెడీతో మెప్పించారు. అయితే ఈ మూవీలో వెంకటేష్ రేంజ్ లో ఆకట్టుకుంటరా అనేది ప్రశ్న. 

45
కథాంశం ఇదే

తెలుగు వెర్షన్‌లో వెంకటేష్ ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. కథలో ఆయన భార్య, నలుగురు పిల్లలతో సుఖంగా జీవిస్తున్న సమయంలో, ఒక ప్రమాదకరమైన ఉగ్రవాదిని పట్టుకునే మిషన్‌లో తిరిగి రంగప్రవేశం చేస్తాడు. కానీ ఆ ఆపరేషన్‌లో ఆయన భార్యతో పాటు మాజీ ప్రేమికురాలు కూడా పాల్గొనడంతో కథలో హాస్యభరితమైన గందరగోళం నెలకొంటుంది. ఈ కథాంశం ప్రేక్షకులను బాగా అలరించడంతో పాటు, సంక్రాంతి సీజన్‌లో ₹300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వెంకటేష్ నటనకు విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు.

55
చాలా కాలంగా హిట్ లేదు

హిందీ రీమేక్‌లో కూడా ఇదే కథను కొద్దిపాటి మార్పులతో రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించబోయే ప్రముఖ హిందీ దర్శకుడిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు అక్షయ్ కుమార్‌తో స్క్రీన్ షేర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ కి కూడా చాలా కాలంగా సరైన హిట్ లేదు. మరి అక్షయ్ కుమార్ కోరుకున్న విజయం సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ తో దక్కుతుందేమో చూడాలి.

ఇదిలా ఉండగా, వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories