నందమూరి బాలకృష్ణ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వ్యవహరించిన విధానంపై సోషల్ మీడియాలో ఎంతో చర్చ జరుగుతోంది. ఈ సంఘటనలో ఎన్నో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కొందరు బాలయ్యని సమర్థిస్తుంటే మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వ్యవహరించిన విధానంపై సోషల్ మీడియాలో ఎంతో చర్చ జరుగుతోంది. ఈ సంఘటనలో ఎన్నో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కొందరు బాలయ్యని సమర్థిస్తుంటే మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీం అయితే అసలు అక్కడ ఏం జరిగింది అన్నట్లు చెబుతున్నారు.
27
మందు బాటిల్ వివాదం ఫేక్ అని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అయితే అంజలిని నెట్టివేయడంపై మాత్రం ఇంకా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బాలయ్య దూకుడు స్వభావం మరో సారి బయట పడింది అంటూ ట్రోల్ చేస్తున్నారు. పబ్లిక్ ఈవెంట్స్ లో బాలయ్య ఇలా స్పందించడం కొత్త కాదు. గతంలో ఇలాంటి వ్యవహారాలతో బాలయ్య విమర్శలు ఎదుర్కొన్నారు.
37
అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీం మాత్రం బాలయ్య అలాంటి వ్యక్తి కాదని సమర్థిస్తున్నారు. వేదికపై నిలబడి ఉన్న సమయంలో బాలయ్య అంజలిని నెట్టి వేశారు. ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడి ఆ తర్వాత తేరుకుంది. ఈ సంఘటనపై ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి స్పందించింది.
47
మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి తరచుగా తన గళం వినిపిస్తూ ఉంటుంది. మహిళలని అవమానించేలా చిన్న సంఘటన జరిగినా చిన్మయి ఊరుకోవడం లేదు. చిన్మయి ఇలాంటి సంఘటనలపై స్పందించిన ప్రతి సారీ తిరిగి ఆమెపైనే ట్రోలింగ్ జరుగుతోంది.
57
తాజాగా చిన్మయి.. బాలకృష్ణ అంజలిని నెట్టివేసిన వీడియో షేర్ చేస్తూ తనదైన శైలిలో స్పందించింది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అంజలి స్పందించాల్సిన విధానం ఇది కాదు అంటూ విమర్శించింది. ఆమెకే లేకపోతే ఎవరేం చేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
67
నేను గమనించిన అతి పెద్ద సమస్య ఇదే. ఆమె నవ్వు చూడండి. ఆమెకే ఉండాలి కదా. ప్రతిసారి టివిలో చూస్తున ప్రేక్షకుల లాగా ఉండిపోవాలంటే కష్టం. శ్రీరామ చంద్రమూర్తి, హరిశ్చంద్ర వారసులుగా, బంధువులుగా వారి ఆదర్శాలని అర్థం చేసుకోలేకపోవడం పొరపాటే అవుతుంది.
77
ఇలాంటివి చూసినప్పుడు మీకు ఎలాంటి నష్టం అనిపించకపోతే.. మహిళలు ఎలా ఉండాలో, ఎలా బిహేవ్ చేయాలో కూడా చెప్పకండి అంటూ సమాజాన్ని ఉద్దేశించి చిన్మయి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో చిన్మయి ఎక్కడా బాలయ్య పేరు ప్రస్తావించలేదు. దీనితో నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ఇంత చెబుతున్నావు.. కనీసం బాలయ్య పేరు చెప్పే ధైర్యం చేయలేకపోయావు అంటూ విమర్శిస్తున్నారు.