హీరోయిన్ల ఎక్స్ ఫోజింగ్ పై కామెంట్స్..సీనియర్ నటి అన్నపూర్ణమ్మపై విరుచుకుపడ్డ చిన్మయి

Published : Feb 25, 2024, 06:50 PM IST

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి తరచుగా తన గళం వినిపిస్తూ ఉంటుంది.

PREV
17
హీరోయిన్ల ఎక్స్ ఫోజింగ్ పై కామెంట్స్..సీనియర్ నటి అన్నపూర్ణమ్మపై విరుచుకుపడ్డ చిన్మయి

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి తరచుగా తన గళం వినిపిస్తూ ఉంటుంది. మహిళలని అవమానించేలా చిన్న సంఘటన జరిగినా చిన్మయి ఊరుకోవడం లేదు. 

27

మీటూ ఉద్యమం చెలరేగినప్పుడు చిన్మయి తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైరాముత్తు తనని లైంగికంగా వేధించినట్లు చిన్మయి సంచలన ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి ఈ వివాదం రగులుతూనే ఉంది. వైరముత్తుపై చిన్మయి అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది. అయితే మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో సైతం చిన్మయి వెనకడుగు వేయడం లేదు. 

37

ఇటీవల సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మహిళలని ఉద్దేశించి వ్యాఖ్యలపై చిన్మయి ఘాటుగా కౌంటర్ వేసింది. అన్నపూర్ణమ్మ టాలీవుడ్ లో 1975 నుంచి కొనసాగుతున్నారు. వందలాది చిత్రాల్లో అన్నపూర్ణమ్మ తల్లి పాత్రల్లో, బామ్మ పాత్రల్లో నటించారు. 

47

ఇటీవల ఇంటర్వ్యూలో అన్నపూర్ణమ్మ ప్రస్తుతం మహిళలపై వినిపిస్తున్న కామెంట్స్ పై స్పందించారు. మహిళలకు సరైన స్వాతంత్రం లేదు అనే కామెంట్స్ కి కూడా అన్నపూర్ణమ్మ బదులిచ్చారు.అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ ఆడదానికి ఎందుకు స్వాతంత్రం కావాలి ? అర్థ రాత్రి ఆడవాళ్లకు ఏం పని ఉంటుంది ? ఎదుటివాళ్ళు మనల్ని ఏమీ అనకూడదు అని అనుకున్నా.. మనం మాత్రం ఏదో ఒక కామెంట్ చేసే విధంగానే బట్టలు వేసుకుని ఎక్స్ ఫోజింగ్ చేస్తున్నాం అంటూ అన్నపూర్ణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

57

తప్పు ఎప్పుడూ ఎదుటి వాళ్లవైపే ఉండదు.. మనది కూడా కొంచెం తప్పు ఉంటుంది అని అన్నపూర్ణమ్మ అన్నారు. ఈ వీడియోపై చిన్మయి సోషల్ మీడియాలో బదులిచ్చింది. అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలపై చిన్మయి సెటైరికల్ గా స్పందించింది. ఆమె నటనకి నేను పెద్ద అభిమానిని. నా ఫేవరిట్ అనుకున్న వాళ్ళు ఇలా మాట్లాడితే గుండె ముక్కలైనట్లు అనిపిస్తుంది. 

67

ఆమె చెబుతున్న రూల్స్ ప్రకారం ఆడవాళ్లకు మెడికల్ ఎమర్జెన్సీ రాత్రి వేళల్లో రాకూడదు. రాత్రి వేళల్లో మహిళలు నర్సులుగా పనిచేయకూడదు. మహిళలు రాత్రి వేళల్లో బిడ్డలకు జన్మ ఇవ్వకూడదు. కనీసం బాత్రూం సౌకర్యం లేని గ్రామాలు ఉన్న ఇండియాలో మనం ఉంటున్నాం. మహిళలు చీకటి పడ్డాక.. సూర్యోదయానికి ముందు బాత్రూం కోసం బయటకి వెళ్లాల్సిన దుస్థితి చాలా గ్రామాల్లో ఉంది. 

77

కానీ అన్నపూర్ణమ్మ చెప్పిన మాటలు వింటుంటే.. మహిళలు కనీసం ఆ అవసరానికి కూడా బయటకు వెళ్ళకూడదు అన్నట్లు ఉంది అంటూ చిన్మయి రెచ్చిపోయింది. ఇలాంటి వాళ్ళ మాటలు వింటుంటే ఇండియాలో మహిళలు ఎందుకు పుట్టాం అనిపిస్తూ ఉంటుంది. ఇండియాలో ఆడవాళ్లకు కర్మ కాలింది రోయ్ అంటూ చిన్మయి సెటైర్లు వేసింది. 

click me!

Recommended Stories