వైట్ కోటు ధరించి ప్యాంట్ లేకుండా ప్రియమణి ఫోజులు..సూపర్ హీరోతో పోల్చుకుంటూ కామెంట్స్

First Published | Feb 25, 2024, 5:39 PM IST

నటన, అభినయం, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు ఉన్న నటి ప్రియమణి.  వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి. 

నటన, అభినయం, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు ఉన్న నటి ప్రియమణి.  వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి. 

టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. అందాలు ఆరబోసేందుకు కూడా వెనుకాడలేదు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తోంది. కెరీర్, పర్సనల్ లైఫ్ విషయంలో ప్రియమణి ప్లానింగ్ తో వ్యవహరించింది. చకచకా సినిమాలు చేసేసింది. విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది. 


సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా టివి రంగంలోకి అడుగు పెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.

ప్రియమణి బుల్లితెరపై కూడా మెరిసింది. పలు డ్యాన్స్ షోలకు  జడ్జిగా వ్యవహరించింది. సోషల్ మీడియాలో ప్రియమణి తరచుగా యువతని మైమరపించేలా గ్లామర్ ఒలకబోస్తున్న సంగతి తెలిసిందే. 

తాజాగా ప్రియమణి  వైట్ కోట్ ధరించి ఫోజులు ఇచ్చింది. మతిపోగొట్టే విధంగా టాప్ టూ బాటమ్ నిండైన సొగసుతో కట్టిపడేస్తుంది. ఆమె వయసు 39 ఏళ్ళు. నాలుగు పదుల వయసు సమీపిస్తున్నప్పటికీ ప్రియమణి ఆ గ్రామర్ పదును ఇంకా తగ్గలేదు. అయితే ఈ ఫోజుల్లో ప్రియమణి ప్యాంట్ ధరించలేదు. పైగా సూపర్ హీరోలు ఇలా వైట్ కోటు ధరిస్తారు అంటూ కామెంట్ పెట్టింది. 

ప్రియమణి మంచి నటి మాత్రమే కాదు. అద్భుతమైన డాన్సర్ కూడా. ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన ప్రియమణి మాస్ స్టెప్పులతో అలరించింది. ఇక అవసరమైనప్పుడు వెండితెరని వేడెక్కించేలా అందాలు ఆరబోసింది. తాజాగా ప్రియమణి నుంచి భామా కలాపం 2 మూవీ ఆహా ఓటిటిలో విడుదలై దూసుకుపోతోంది. సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియమణి అదరగొట్టేసింది. 

Latest Videos

click me!