నేడు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం నేడు. దీన్ని పురస్కరించుకుని నవంబర్ 14 చిల్డ్రన్స్ డే గా జరుపుకుంటారు. చాచా నెహ్రూ పిల్లల సంక్షేమం కోసం పాటు పడ్డారు. అందుకు గుర్తుగా ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా బెస్ట్ చైల్డ్ ఓరియెంటెడ్ మూవీస్ ఏమిటో చూద్దాం...
19
Children s day special movies
లవకుశ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కించిన చిత్రాల్లో క్లాసిక్ గా ఉంది. ఎన్టీఆర్, అంజలి రాముడు, సీత పాత్రలు చేశారు. ఈ మూవీ రాముడు కుమారులు లవ, కుశల కోణంలో సాగుతుంది. వారి సాహసాలు,అల్లరితో కూడా లవకుశ గొప్ప విజయం అందుకుంది.
29
Children s day special movies
దర్శకుడు మణిరత్నం అన్ని జోనర్స్ ట్రై చేశారు. ఆయన తెరకెక్కిన బాలల చిత్రాల్లో ఆల్ టైం క్లాసిక్ గా ఉంది. ఈ మూవీలో సాంగ్స్ దశాబ్దాల పాటు వినిపించాయి. కామెడీ, ఎమోషన్ ప్రధానంగా తెరకెక్కిన చిత్రం బేబి షామిలి, తరుణ్ ప్రధాన పాత్రలు చేశారు. రఘువరన్, రేవతి ఇతర కీలక రోల్స్ చేశారు. తరుణ్, షామిలి నేషనల్ అవార్డ్స్ కొల్లగొట్టారు.
39
Children s day special movies
జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా కనిపించి మెప్పించిన చిత్రం రామాయణం. కేవలం బాల నటులతో దర్శకుడు గుణశేఖర్ ఈ ప్రయోగం చేశారు. రామాయణం బెస్ట్ బాలల చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. నేషనల్ అవార్డు గెలుచుకుంది.
Related Articles
49
Children s day special movies
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన సోషియో ఫాంటసీ చిత్రం ఘటోత్కచుడు. కైకాల సత్యనారాయణ ఘటోత్కచుడు రోల్ చేశాడు. ఓ పాప చుట్టూ ఈ కథ సాగుతుంది. ఆమె కాపాడే పాత్రల్లో కైకాల, అలీ, రోజా నటించారు.
59
Children s day special movies
దేవుళ్ళు మూవీ భక్తిరస ప్రధానంగా తెరకెక్కిన చైల్డ్ మూవీ. పృథ్విరాజ్, రాశి హీరో హీరోయిన్స్ గా నటించారు. వీరి పిల్లలు మొక్కులు తీర్చుకునేందుకు సహస యాత్ర చేస్తారు. దేవుళ్ళు సాంగ్ సూపర్ హిట్.
69
Children s day special movies
సిసింద్రీ మూవీతో అక్కినేని వారసుడు అఖిల్ వెండితెరకు పరిచయం అయ్యాడు. కేవలం ఏడాది ప్రాయంలో సిసింద్రీ మూవీలో అఖిల్ నటించాడు. నాగార్జున ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేశాడు. సుధాకర్, తనికెళ్ళ భరణి, గిరి బాబు కీలక రోల్స్ చేసిన సిసింద్రీ సూపర్ హిట్ కొట్టింది. బేబీస్ డే అవుట్ అనే ఇంగ్లీష్ మూవీ రీమేక్ ఇది.
79
Children s day special movies
దర్శకుడు గంగరాజు గుణ్ణం తెరకెక్కించిన లిటిల్ సోల్జర్స్ బాలల చిత్రాల్లో బెస్ట్ అని చెప్పొచ్చు. బాలాదిత్య, బేబీ కావ్య ప్రధాన పాత్రలు చేశారు. అప్పట్లో ఈ మూవీ భారీ విజయం అందుకుంది.
89
Children s day special movies
బాల భారతం మూవీలో కౌరవులు, పాండవులను బాలలుగా చూపిస్తూ తెరకెక్కించారు. ఈ మూవీ శ్రీదేవి శ్రీకృష్ణుడు పాత్ర చేయడం విశేషం. పిల్లలు బాగా ఎంజాయ్ చేసే చిత్రాల్లో ఇది ఒకటి.
99
Mahesh Babu
హీరో కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం కొడుకులు దిద్దిన కాపురం. మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేశాడు. మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన చిత్రాల్లో ఇది ఒకటి. మహేష్ బాబు మీద ప్రధానంగా సాగే ఈ చిత్రం హిట్ అందుకుంది. విజయశాంతి మహేష్ తల్లి పాత్ర చేశారు.