మరి మహేష్ బాబు వద్దకు ఈ స్క్రిప్ట్ ఎందుకు వెళ్లిందనేది చూస్తే, అందుకు కారణం సూపర్ స్టార్ కృష్ణ. ఆయన శివాజీ పాత్రలో నటించడమే కారణం. `చంద్రహాస్` అనే సినిమాలో కృష్ణ ఛత్రపతి శివాజీ పాత్రలో కాసేపు మెరిశాడు.
దీంతో ఆయన కొడుకు మహేష్ బాబు ఛత్రపతి శివాజీ కొడుకు శంబాజీగా బాగా సూట్ అవుతుందని భావించి మహేష్‌కి ఈ కథ చెప్పారట దర్శకుడు.కానీ తాను ఇది చేయలేనని సూపర్ స్టార్ రిజెక్ట్ చేశారట. అలా మరో పెద్ద బ్లాక్ బస్టర్‌ని ఆయన మిస్ చేసుకున్నారు మహేష్. బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రాలను ఆయన వరుసగా వదులుకుంటున్నారు.
అంతకు ముందు `పుష్ప`, `యానిమల్` చిత్రాలను కూడా మహేష్ చేయాల్సిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు `ఛావా` విషయంలోనూ అదే జరిగింది. మంచి సినిమాలను మహేష్ బాబు వదులుకున్నారని ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.