Chhaava telugu: విక్కీ కౌశల్ 'ఛావా' తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్!

Published : Feb 26, 2025, 03:29 PM IST

 Chhaava telugu:  విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' చిత్రం బాలీవుడ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుందని సమాచారం.

PREV
13
 Chhaava telugu:  విక్కీ కౌశల్ 'ఛావా' తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్!
Chhaava movie telugu version release date fixed in telugu

 Chhaava telugu:   గత కొద్ది రోజులుగా ఎక్కడ విన్నా  ‘ఛావా’చిత్రం గురించిన కబుర్లే. ఈ చిత్రం బాలీవుడ్ లో  పాత రికార్డులు  చెరిపేసి.. సరికొత్తవి సృష్టిస్తోంది.   విక్కీ కౌశల్ నటన ఇప్పుడు  దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోన్న విషయం.

  ఛావాలో శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ అదరకొట్టేసాడంటున్నారు. సినిమా చూసి చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఎమోషనల్ అవుతున్నారు. ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమా  కోట్లు కొల్లగొడుతుంది.  తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ చేయమని ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తెలుగు డబ్బింగ్ వెర్షన్  రిలీజ్ డేట్ ఫిక్సైందని తెలుస్తోంది. 

23
Chhaava movie telugu version release date fixed in telugu


 ఈ సినిమాను హిందీలో చూసిన కొంత మంది తెలుగులో రిలీజ్  చేస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదిక అడగటంతో డైరక్ట్ ఓటిటీలో మొదట తెలుగు వెర్షన్ రిలీజ్ చేద్దామనుకున్నది విరమించుకున్నట్లు సమాచారం.

దాంతో  ఈ  సినిమాని తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాని తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వినికిడి. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  మార్చి 7వ తేదీన ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ కానుంది. ఆ రోజు చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవి లేకపోవడంతో ఆ రోజు సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఇంకా అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు.
 

33
Chhaava movie telugu version release date fixed in telugu

ఇప్పటివరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.483 కోట్లు రాబట్టింది. రేపో మాపో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరనుంది. కేవలం మన దేశంలోనే కాదు.. ఓవర్సీస్‌లో కూడా సినిమా మంచి కలెక్షన్లు రాబట్టుకోగలుగుతుంది. అలాగే అత్యంత వేగంగా రూ. 300 నెట్ కలెక్షన్లు వసూలు చేసిన 8వ సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది.

ఇక ఈ మంత్ ఎండింగ్ వరకు పెద్ద సినిమాలేవీ రిలీజ్‌కు లేకపోవడంతో మరికొన్ని రికార్డులు క్రియేట్ చేసేటట్లే కనిపిస్తుంది. తెలుగు వర్షన్‌లో ఛావా రిలీజైతే ఇక్కడ మరింత కలెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉంది. ఇంత గొప్ప సినిమాను టాలీవుడ్‌ ఆడియన్స్‌కు అందించాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ భావిస్తున్నారట. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ ఛావా తెలుగు డబ్బింగ్‌ పనులను ప్రారంభించినట్లు సమాచారం

Read more Photos on
click me!

Recommended Stories