సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న జ్యోతిక ఆ తర్వాత దియా, దేవ్ పుట్టిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత `36 వయదినిలే` సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ తర్వాత మహిళా ప్రధాన కథలకు ప్రాధాన్యతనిస్తూ నటిస్తోంది.
అందులో, `మహిళా మట్టుం`, `నాచ్చియార్`, `చెక్క శివంత వానం`, `కాట్రిన్ మొళి`, `రాక్షసి`, `జాక్‌పాట్`, `పొన్మగల్ వందాల్`, `ఉడన్‌పిరప్పే` ఇలా వరుసగా మహిళలకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుని నటించింది. చాలా వరకు విజయాలు అందుకుంది.