అవునా... నిజమా...! అనసూయ అందం తగ్గడానికి అసలు కారణం బయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్

Published : Jun 17, 2022, 10:04 AM ISTUpdated : Jun 17, 2022, 10:31 AM IST

జబర్దస్త్ షోలో కమెడియన్లు చేసే కామెడీ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం జబర్దస్త్ లో చలాకి చంటి, నూకరాజు లాంటి వాళ్ళు ప్రధాన కమెడియన్స్ గా ఉన్నారు. తాజాగా జబర్దస్త్ ప్రోమో విడుదలయింది.

PREV
16
అవునా... నిజమా...! అనసూయ అందం తగ్గడానికి అసలు కారణం బయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్ షోలో కమెడియన్లు చేసే కామెడీ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం జబర్దస్త్ లో చలాకి చంటి, నూకరాజు లాంటి వాళ్ళు ప్రధాన కమెడియన్స్ గా ఉన్నారు. తాజాగా జబర్దస్త్ ప్రోమో విడుదలయింది. ఈ ఎపిసోడ్ జూన్ 23న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ కి పూరి జగన్నాధ్ తనయుడు యువ హీరో ఆకాష్ అతిథిగా హాజరయ్యాడు. 

26

ఆకాష్ పూరి ప్రస్తుతం చోర్ బజార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆకాష్ పూరితో పాటు ఆ చిత్ర హీరోయిన్ గెహెనా సిప్పీకూడా జబర్దస్త్ కి హాజరైంది. ప్రోమో చూస్తుంటే వీరిద్దరూ జబర్దస్త్ స్కిట్ లని బాగా ఎంజాయ్ చేసినట్లు ఉన్నారు. 

36

చలాకి చంటి చేసిన మూలికల స్కిట్ ఆకట్టుకునేలా విధంగా ప్రోమోలో ఉంది. ఆకాష్ పూరి రెఫరెన్స్ వచ్చేలా చలాకి చంటి స్కిట్ చేశాడు. మీకు కావాల్సిన అన్ని మూలికలు నాదగ్గర ఉన్నాయ్ రండి అంటూ చలాకి చంటి ఎంటర్ అవుతాడు. జడ్జిగా ఉన్న సింగర్ మనో అది ఉందా అని అడుగుతాడు. లాస్ట్ టైం మీకు పెద్దది ఇచ్చా అని చలాకి చంటి అంటాడు.. అదిబావుంది అని మనో చెప్పడం నవ్వులు పూయించే విధంగా ఉంది. 

46

నూకరాజు.. చంటి దగ్గరకి వచ్చి నా పేరు భూమి ఇడ్లి అని అంటాడు. అదేం పేరు అని చంటి ఆశ్చర్యంగా అడుగుతాడు. ఆయన ఆకాష్ పూరి అని పెట్టుకుంటే తప్పు లేదు నేను భూమి ఇడ్లి అని పెట్టుకుంటే తప్పా అని నూకరాజు అడగడంతో నవ్వులు పూశాయి. దీనికి చంటి సమాధానం ఇస్తూ.. ఆయన ఆకాశం అంత ఎత్తు ఎదగాలని వాళ్ళ నాన్న నా దగ్గరకి వచ్చి పెద్ద మూలిక తీసుకుపోయి ఆ పేరు పెట్టాడు. మీ నాన్న నీ కోసం ఏ మూలికా తీసుకుపోలేదు అని నూకరాజుతో అంటాడు. 

56

నాకు అందం పెరిగిపోతోందని భాదపడుతూ ఒకరు నా దగ్గరకి వచ్చారు అని చలాకి చంటి అంటాడు. దీనితో నూకరాజు వెంటనే అనసూయ కదా అని చెప్పడంతో భలే చెప్పావు అని చంటి అంటాడు. నా అందం తగ్గడానికి ఏదైనా మూలిక ఇమ్మని అడిగింది. ఇది వాడు అని ఒక మూలిక ఇచ్చి.. నీ బ్రెయిన్ లో అందం పెరుగుతోంది అని ఏదైతే భ్రమ ఉందొ అది పోతుంది అని చెప్పా. తనపై వేసిన పంచ్ లకి అనసూయ కూడా నవ్వుకుంటుంది. 

66

ఆ తర్వాత చేసిన రాకెట్ రాఘవ, తాగుబోతు రమేష్ స్కిట్ లు కూడా చాలా బావున్నాయి. ఈ ఎపిసోడ్ లో అనసూయ శారీలో అందంగా కనిపిస్తోంది. కంప్లీట్ ఎపిసోడ్ జూన్ 23న టెలికాస్ట్ కాబోతోంది. 

click me!

Recommended Stories