Chaari 111 First Review: వెన్నెల కిశోర్‌ `చారి 111` ఫస్ట్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

Published : Feb 29, 2024, 01:46 PM ISTUpdated : Feb 29, 2024, 01:47 PM IST

వెన్నెల కిశోర్‌ హీరోగా టర్న్ తీసుకుని `చారి 111` చిత్రంలో నటించాడు. జేమ్స్ బాండ్‌ తరహా పాత్రలో మెరిశారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది.   

PREV
15
Chaari 111 First Review: వెన్నెల కిశోర్‌ `చారి 111` ఫస్ట్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

కమెడియన్లు ఇటీవల హీరోలుగా మారుతున్నారు. అలరిస్తున్నారు. అలీ, సునీల్‌, సప్తగిరి, శ్రీనివాస్‌ రెడ్డి నుంచి ఈ ట్రెండ్‌ నడుస్తుంది. ఇప్పుడు మరో స్టార్‌ కమెడియన్‌ వెన్నెల కిశోర్‌ కూడా హీరోగా మారాడు. ఆయన ఇప్పుడు జేమ్స్ బాండ్‌ స్టయిల్లో `చారి 111` అనే సినిమా చేశాడు. టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వం వహించారు. అదితీ సోనీ నిర్మిస్తోంది. ముర‌ళీశ‌ర్మ తోపాటు బ్ర‌హ్మాజీ, రాహుల్ ర‌వీంద్ర‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకున్నాయి. పాట కూడా అదిరిపోయింది. 
 

25

వెన్నెల కిశోర్‌ కామెడీతో మెప్పిస్తున్నాడు. స్టార్‌ హీరోలతో కలిసి నటిస్తూ నవ్వులు పూయిస్తున్నాడు. దాదాపు అందరు స్టార్‌ హీరోల సినిమాల్లో ఆయన ఉండాల్సిందే. ఒకప్పటి బ్రహ్మానందం స్థానాన్ని ఆయన భర్తీ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇంతటి బిజీలోనూ ఆయన హీరోగా ఈ సినిమా చేయడం విశేషం. హీరో కావడంతో తను కూడా ఎగ్జైట్‌ అయి ఉండచ్చు. అయితే కమెడియన్లు హీరోగా సినిమాలు చేసి సక్సెస్‌ అయ్యింది చాలా తక్కువ. ఒకటి రెండు సినిమా ఆడితే, చాలా వరకు బెడిసి కొట్టాయి. ఈ నేపథ్యంలో `చారి 111` మూవీ వెన్నెల కిశోర్‌ని హీరోగా నిలబెడుతుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 
 

35

ఈ మూవీ మార్చి 1న(రేపు) విడుదల కాబోతుంది. అయితే కొంత మంది సెలబ్రిటీలకు ఈ మూవీని ప్రత్యేకంగా(ప్రీమియర్స్) ప్రదర్శించినట్టు తెలుస్తుంది. దీంతో వాళ్లు సినిమా చూసి తమ ఎగ్జైట్‌మెంట్‌ని పంచుకున్నారు. సినిమా గురించి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్‌ సైమన్‌ కే కింగ్‌ `చారి 111`పై తన ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. సింపుల్‌గా చెప్పాలంటే సినిమా అదిరిపోయిందని, నవ్వుల రోలర్‌ కోస్టర్‌ అని చెప్పాడు. 

45

`లాక్‌ అయ్యింది, లోడ్‌ అయ్యింది, ఫైర్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇది కచ్చితంగా అదిరిపోయే వినోదాన్ని పంచే మూవీగా ఆడియెన్స్ ముందుకొస్తుంది. వెన్నెల కిషోర్‌ ఫ్యాన్స్ ఎంజాయ్‌ చేసేలా బీజీఎం, మ్యూజిక్‌ ఉంది` అని వెల్లడించారు. అలాగే ఇతరులు కూడా సినిమా పూర్తి ఫన్‌ రైడ్‌ అంటున్నారు. వెన్నెల కిశోర్‌ సీరియస్ గా చేసే యాక్షన్‌ నవ్వులు పూయిస్తుందట. ఇందులో కామెడీతోపాటు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లు, ట్విస్టులు, యాక్షన్‌ ఎలిమెంట్లు ఉంటాయని, అన్నింటికి మించి వెన్నెల కిశోర్‌ ఫన్‌ నెక్ట్స్ లెవల్ అంటున్నారు. హీరోయిన్‌ సంయుక్త విశ్వనాథన్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. 
 

55

`చారి 111`లో వెన్నెల కిశోర్‌, హీరోయిన్‌ సంయుక్త విశ్వనాథన్‌ స్పై రోల్‌లో నటిస్తున్నారు. వీరికి హెడ్‌గా మురళీ శర్మ కనిపిస్తున్నారు. జేమ్స్ బాండ్‌ రేంజ్‌లో ఫీలైన వెన్నెల కిశోర్‌ అనేక మిస్టేక్స్ చేస్తూ పై ఆఫీసర్‌ చేత తిట్టుతింటుంటాడు. చివరికి హీరోయిన్‌ కూడా నువ్వు హీరో అనుకుంటున్నావేమో, కమెడియన్‌వే అని ట్రైలర్‌ లో చెప్పడం చూస్తుంటే ఆ విషయం అర్థమవుతుంది. అయితే తన తికమకతోనే ఓ పెద్ద క్రైమ్‌ని వెన్నెల కిశోర్‌ ఎలా సాల్వ్ చేశాడనేది ఆసక్తికరంగా ఉండబోతుందట. ప్రస్తుతానికి పాజిటివ్‌ టాక్ ఉంది, మరి నిజంగా సినిమా అలానే ఉందా? ఎలా ఉందనేది శుక్రవారంతో క్లారిటీ రానుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories