ఇంటర్ లోనే ఇల్లు వదిలేశా, యాసిడ్ పోస్తాను అంటే ఒకడి తలపగలగొట్టాను... బ్రహ్మముడి అప్పు ఇంత రెబలా?

Published : Feb 29, 2024, 01:28 PM IST

సూపర్ హిట్ బ్రహ్మముడి సీరియల్ లో అప్పు పాత్ర చేస్తున్న నైనిషా రాయ్ నిజ జీవితంలో కూడా మగరాయుడే నట. యాసిడ్ పోస్తాను అన్నవాడి తలకాయ పగలగొట్టిందట. తన రియల్ లైఫ్ ఫ్యాన్స్ కి వివరించింది.   

PREV
16
ఇంటర్ లోనే ఇల్లు వదిలేశా, యాసిడ్ పోస్తాను అంటే ఒకడి తలపగలగొట్టాను... బ్రహ్మముడి అప్పు ఇంత రెబలా?
Nainisha Rai

బ్రహ్మముడి ఫేమ్ నైనిషా రాయ్ వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయ్యారు. ఆమె తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. నైనిషా రాయ్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. 

26
Nainisha Rai

నేను అద్దం లాంటి దాన్ని. ఎమోషన్ ఏదైనా నేరుగా చూపించేస్తాను. కాలేజ్ రోజుల్లో చాలా మంది ధమ్కీ ఇవ్వడానికి ట్రై చేశారు. ఒకడి తల పగలగొట్టాను. వాడు నా మీద యాసిడ్ పోస్తాను అన్నాడు. వాడు యాసిడ్ పోయక ముందే వాడి తల పగలగొడట్టాను. నేను హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించి ఇంటికి పంపాను. 

 

36
Nainisha Rai

నేను ఇంటర్లోనే ఇంటిని నుండి బయటకు వచ్చేశాను. అందుకే కుటుంబంతో సమస్యలు లేవు. మాకు తెలుగు రాదని కొందరు అంటారు. కానీ తెలుగు నేర్చుకున్నాను. కొందరు తెలుగు వారం అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. నాకు తెలుగులో బూతులు బాగా నచ్చుతాయి. బూతులతోనే తెలుగు నేర్చుకున్నాను. 

46
Brahmamudi

ఫస్ట్ 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' లో సీరియల్ విలన్ గా అవకాశం వచ్చింది. తర్వాత నన్ను తీసేశారు. స్టడీస్ కోసం ఢిల్లీ వెళ్ళాను. అప్పుడు మూడు సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. లాక్ డౌన్ లో శ్రీమంతుడు సీరియల్ ఆఫర్ వచ్చింది. ఆ సీరియల్ లో నాది సాఫ్ట్ ఏడుపుగొట్టు క్యారెక్టర్. 
 

56
Brahmamudi

నాకు బెంగాలీ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఒరియా భాషలు వచ్చు . ఓ తమిళ్ సీరియల్ లో ఆఫర్ వచ్చింది. రెండు రోజుల షూటింగ్ తర్వాత నచ్చక వచ్చేశాను. బ్రహ్మముడి సీరియల్ అయిష్టంగానే ఒప్పుకున్నాను. కానీ ఆ సీరియల్ నాకు చాలా పేరు తెచ్చిపెట్టింది... అని నైనిషా రాయ్ చెప్పుకొచ్చింది... 

 

66
Brahmamudi

నైనిషా రాయ్ కెరీర్ బిగినింగ్ లో అనేక కష్టాలు పడ్డట్లు గతంలో చెప్పారు. ఒక దశలో తినడానికి తిండి లేక రక్తం అమ్ముకుందట. ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్స్ అడిగేవారని ఆమె ఆవేదన చెందింది... 

click me!

Recommended Stories