సూపర్ స్టార్ కృష్ణకి నివాళులు అర్పించిన సెలెబ్రిటీలు..ఫ్యామిలీ కాకుండా ఎవరెవరు వచ్చారంటే, ఫోటోస్ 

First Published | Nov 15, 2023, 9:19 PM IST

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి, అభిమానులకు దూరమై ఏడాది గడచిపోయింది. గత ఏడాది సరిగ్గా ఇదే రోజు కృష్ణ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు. 

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి, అభిమానులకు దూరమై ఏడాది గడచిపోయింది. గత ఏడాది సరిగ్గా ఇదే రోజు కృష్ణ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు. 

వెండి తెరపై సాహసాల వీరుడిగా కృష్ణ చెరగని ముద్ర వేశారు. కృష్ణ లెగసీని  కంటిన్యూ చేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 


తండ్రి తొలి వర్ధంతి సందర్భంగా మహేష్ బాబు, నమ్రత, గౌతమ్ కృష్ణ ఇతర కుటుంబ సభ్యులంతా కృష్ణ చిత్ర పటానికి పుష్పాలు సమర్పించి నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా మహేష్ ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేసారు. ఎప్పటికీ ఆయనే సూపర్ స్టార్ అంటూ కృష్ణ యంగ్ ఏజ్ లో ఉన్న పిక్ పోస్ట్ చేశారు. నమ్రత కూడా ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేసింది. 

మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాం మామయ్య గారు. మా ఆలోచనల్లో,ప్రార్థనల్లో మీరు ఎప్పటికి ఉంటారు. మీ జ్ఞాపకాలని, మధురానుభూతుల్ని కలిగిన మేము అదృష్టవంతులం. 

మీరు అందించిన ప్రేమని పంచుతూ కొనసాగుతాం అని నమ్రత ఎమోషనల్ పోస్ట్ చేసింది. కృష్ణ చిత్ర పటానికి నివాళులు అర్పించేందుకు కృష్ణ కుటుంబ సభ్యులంతా తరలి వచ్చారు. 

మహేష్ బాబు, నమ్రత, గౌతమ్ కృష్ణ, కుమార్తె మంజుల, అలాగే గల్లా జయదేవ్ కుటుంబం, సోదరుడు ఆదిశేషగిరి రావు తరలి వచ్చారు. కృష్ణ ని గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు. 

ఇక కుటుంబ సభ్యులు కాకుండా మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు కూడా కృష్ణకి నివాళులు అర్పించారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా నివాళులు అర్పించారు. 

చిత్ర పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖ దర్శకులు హాజరయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సూపర్ స్టార్ కృష్ణ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. 

అదే విధంగా సీనియర్ డైరెక్టర్ కోందండ రామిరెడ్డి, వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్ లాంటి వారంతా హాజరయ్యారు. వంశి పైడిపల్లి మహేష్ బాబుతో మహర్షి చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 

ఇక మెహర్ రమేష్ కి మహేష్ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ ఒక చరిత్ర. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హేమా హేమీలు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో వచ్చిన కృష్ణ తన సాహసాలతో సినిమా మేకింగ్ కి కొత్త నిర్వచనం చెప్పారు. 

కౌబాయ్ చిత్రాలకు కృష్ణ బ్రాండ్ గా మారారు. వెండి తెరపై అల్లూరి సీతారామరాజుగా కృష్ణ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆ పాత్ర టాలీవుడ్ చరిత్రలోనే సంచలనం అని చెప్పాలి. 

Latest Videos

click me!