Payal Rajput : ఐదేళ్లుగా ఒక్క హిట్ లేదు.. ఆ నిర్ణయంతోనే ఫ్లాప్స్.. క్లారిటీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్

First Published | Nov 15, 2023, 5:57 PM IST

పాయల్ రాజ్ పుత్ నటించిన ‘మంగళవారం’ రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన పాయల్ కెరీర్లోని ప్లాఫ్స్, తదితర అంశాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 
 

పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)  తెలుగు, తమిళ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. పంజాబీ చిత్రాలతో మొదలైన ఆమె కెరీర్ ప్రస్తుతం సౌత్ లో సాగుతోంది. ఆరేళ్ల సినీ జర్నీలో పాయల్ చాలా సినిమాలు చేసింది.
 

అయితే, పాయల్ తెలుగులో నటించిన మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్100’తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. ఆ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. 
 


ఇప్పుడు వారిద్దరి కాంబోలో ‘మంగళవారం’ (Mangalavaaram)  ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎల్లుండి (నవంబర్ 17)న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా పాయల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. సినిమా గురించి పలు విషయాలు మాట్లాడారు. ఈక్రమంలో తన కెరీర్ లో వరుస ఫ్లాప్స్ పైనా స్పందించారు. 

ఫ్లాప్స్ పై పాయల్ మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడ మొదటి చిత్రమే (RX100)  నెగెటివ్ రోల్ చేశాను. అందులో ఆ పాత్ర సెన్సేషన్ గా మారింది. మళ్లీ అలాంటి రోల్స్ చేయడం.. ఇతర పాత్రలు పోషించినా పెద్దగా ఫలితానివ్వలేదు. ఆడియెన్స్ నన్ను రిసీవ్ చేసుకున్న  తీరు మారడానికి టైమ్ పట్టింది.  

విభిన్న పాత్రల్లో నటించాలనేది నా కోరిక. కానీ మొదట నేను చేసిన నెగెటివ్ ఇంపాక్ట్ పోలేదు. దాంతో సీనియర్ హీరోలతో ఛాన్స్ వచ్చినా పెద్దగా రిజల్ట్ దక్కలేదు. కానీ తెలుగు ప్రేక్షకులు నా పెర్ఫామెన్స్ ను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. వారి వల్లే నాకిక్కడ ఆఫర్స్ వస్తున్నాయి. బిగ్ స్టార్స్ నుంచి ఆఫర్స్ రాకపోయినా.. ప్రత్యేకమైన చిత్రాలు చేస్తున్నాను. ‘మంగళవారం’ పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను. 

ఆరేళ్లుగా పాయల్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ ‘మంగళవారం’తో వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మంచి హైప్ ను క్రియేట్ చేసింది. పాయల్ కూడా ‘మంగళవారం’తో హిట్ ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకులు సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తుండటం విశేషం.
 

ఇక సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. చిన్న చిన్న పాత్రలకు నిన్ను తీసుకోలేనని భూపతి సార్ స్పష్టం చేశారు. ఆయనకు నా పొటెన్షియల్,  నా ట్యాలెంట్ తెలుసు. ఆయన నుంచి ఫోన్ రాగానే ఓకే చేశా. తెలుగు ఇండస్ట్రీలో ఇది నా టర్నింగ్ పాయింట్, కమ్ బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నా.  'మంగళవారం'లో నేను శైలు పాత్రలో నటించా. సినిమా చూశాక ఆ అమ్మాయి మీద మీకు సింపతీ వస్తుంది. సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. చాలా సెన్సిటివ్ టాపిక్ డిస్కస్ చేశాం. రెస్పాక్ట్ ఇస్తూ సెన్సిటివిటీతో సినిమా తీశాం.     
 

ఈపాత్ర కోసం నాకంటే ముందు ఆల్మోస్ట్ 35 మందిని ఆడిషన్ చేశారు. అప్పటికే అజయ్ గారి వెంటపడటం.. ఆయనా చివరకు ఆడిషన్ చేసి నన్నే ఓకే చేశారు. ఇందులో శైలు క్యారెక్టర్ కు సంబంధించి హెయిర్, మేకప్ కోసం ప్రతి రోజు రెండు గంటలు పట్టింది. మేకప్ కంటే క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ నుంచి బయటకు రావడానికి ఎక్కువ టైమ్ పట్టింది. షూటింగ్ కంప్లీట్ చేశాక 15 రోజులు దాన్నుంచి బయటకు రాలేదు. మా అమ్మ దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్నాను. చేతి మీద గాట్లు, నా లుక్ చూసి 'నీకు ఏమైంది?' అని అమ్మ అడిగింది. పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఉన్నావ్ అని చెప్పింది. 
 

Latest Videos

click me!