'వాల్తేరు వీరయ్య'తో బన్నీ హీరోయిన్ అప్ సెట్.. మొండి చెయ్యి చూపించారా ?

First Published Jan 2, 2023, 12:05 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి అభిమానులని ఉర్రూతలూగించేందుకు 'వాల్తేరు వీరయ్య'గా వచ్చేస్తున్నారు. దర్శకుడు బాబీ.. వింటేజ్ మెగాస్టార్ ని సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి అభిమానులని ఉర్రూతలూగించేందుకు 'వాల్తేరు వీరయ్య'గా వచ్చేస్తున్నారు. దర్శకుడు బాబీ.. వింటేజ్ మెగాస్టార్ ని సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆచార్య చిత్రం డిజాస్టర్ కావడం, గాడ్ ఫాదర్ మూవీ రీమేక్ కావడంతో మెగా ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ కి హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఇక మరో హీరోయిన్ గా కీలక పాత్రలో కేథరిన్ నటిస్తోంది. అయితే కేథరిన్ ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి చాలా మందికి తెలియదు. 

కేథరిన్ చివరగా మాచర్ల నియోజకవర్గం, బింబిసారా చిత్రాల్లో నటించింది. మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్ కాగా.. బింబిసారా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిత్రం కావడంతో కేథరిన్ మరింత పబ్లిసిటీ పొందొచ్చు అనుకుంది. కానీ చిత్ర రిలీజ్ టైం దగ్గర పడుతున్నప్పటికీ ఆమె ఈ చిత్రంలో నటిస్తున్న విషయమే చాలా మందికి తెలియదు. ఈ విషయంలో కేథరిన్ బాగా అప్ సెట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. 

కేథరిన్ ని ఇంతవరకు వాల్తేరు వీరయ్య చిత్ర ప్రెస్ మీట్స్ కి ఆహ్వానించలేదట. చివరకు ఐటెం సాంగ్ చేసిన ఊర్వశి రౌటేలాని కూడా పిలిపించారు. కనీసం చిరంజీవితో సాంగ్స్ లో స్క్రీన్ స్పేస్ అయినా దక్కుతుందని కేథరిన్ భావించిందట. కానీ ఆమెకి ఎలాంటి సాంగ్ లేదనే వార్తలు వస్తున్నాయి. 

తన చిత్రాలని కేథరిన్ సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేసుకుంటుంది. కానీ వాల్తేరు వీరయ్య విషయంలో నిరాశతో ఉండడంతో కేథరిన్ ఇంతవరకు ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. 

ఇక చిత్ర రిలీజ్ కి 10 రోజుల సమయం ఉంది. ఈలోగా ఆమెని చిత్ర యూనిట్ బుజ్జగిస్తుందేమో చూడాలి. అలాగే చిత్రంలో ఆమె రోల్ పవర్ ఫుల్ గా ఉంటే ఈ నిరాశ మొత్తం తొలిగిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. కేథరిన్ అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో, సరైనోడు చిత్రాల్లో నటించింది. 

click me!