వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ వేడుకలో ఫిదా చేసిన కేథరిన్.. బొద్దుగా మారి హాట్ నెస్ పెంచేసిన లేడీ ఎమ్మెల్యే

First Published Jan 9, 2023, 10:13 AM IST

కేథరిన్ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంలో నటించింది. ఆదివారం రోజు వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ వేడుక వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది.

చూడగానే మాయలో పడిపోయే సోయగాలు కేథరిన్ సొంతం. అందం, నటన ఉన్నప్పటికీ కేథరిన్ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయింది. కేథరిన్ చమ్మక్ చల్లో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2013లో ఆ చిత్రం విడుదలయింది. అదే ఏడాది అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.

ఇద్దరమ్మాయిలతో చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ ఆ మూవీలో కేథరిన్ లుక్స్, డాన్సులు చూసి తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కుర్రాళ్ళు ఆమె గ్లామర్, ఎనెర్జీకి ఫిదా అయ్యారు. అల్లు అర్జున్ వేగాన్ని అందుకుంటూ కేథరిన్ కూడా డాన్స్ తో అదరగొట్టింది. 

కేథరిన్ గ్లామర్ కు తగ్గట్లుగా అవకాశాలు వచ్చాయి. కానీ పరాజయాలు ఎదురుకావడంతో పోటీలో వెనుకబడింది. ఆమెకు ఆఫర్స్ తగ్గాడనికి కారణం ఇదే. మరోసారి అల్లు అర్జున్ సరసన నటించిన సరైనోడు చిత్రం కేథరిన్ కెరీర్ కు జోష్ తెచ్చింది అని చెప్పొచ్చు. 

కేథరిన్ చివరగా మాచర్ల నియోజకవర్గం, బింబిసారా చిత్రాల్లో నటించింది. మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్ కాగా.. బింబిసారా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇటీవల కేథరిన్ కి చెప్పుకోదగ్గ ఆఫర్స్ వస్తున్నాయి. 

ప్రస్తుతం కేథరిన్ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంలో నటించింది. ఆదివారం రోజు వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ వేడుక వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ వేడుకకి కేథరిన్ కూడా హాజరైంది. 

శృతి హాసన్ రాకపోవడంతో ప్రీరిలీజ్ ఈవెంట్ గ్లామర్ అట్రాక్షన్ మొత్తం కేథరిన్ కొట్టేసింది. మతిపోగొట్టే చీరలో బొద్దు అందాలతో అందరిని కట్టిపడేసింది. ఆమె సొగసు యువతకి విజువల్ ట్రీట్ లాగా అనిపించింది. 

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం కేథరిన్ గ్లామర్ లుక్స్ గురించే చర్చించుకుంటున్నారు. కళ్ళు చెదిరే గ్లామర్ మెరుపుతో కేథరిన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇంత సొగసుని ఇన్నిరోజులు ఎక్కడ దాచింది అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 

ప్రీరిలీజ్ వేడుకలో కేథరిన్ ప్రసంగిస్తూ చిరంజీవి లాంటి మెగాస్టార్ తో కలసి నటించడం నిజంగా గౌరవం అని పేర్కొంది. దర్శకుడు బాబీ తన పాత్రని చెప్పినట్లుగా తీర్చిదిద్దారని పేర్కొంది. 

ప్రీరిలీజ్ వేడుకలో స్కై  బ్లూ శారీలో మెరిసిన కేథరిన్ బొద్దుగా కనిపిస్తూ నెక్స్ట్ లెవల్ హాట్ నెస్ తో అదరగొట్టింది. ప్రస్తుతం నెటిజన్లు కేథరిన్ జపం చేస్తున్నారు. 

కేథరిన్ వెండి తెరపై ఎప్పుడూ హద్దులు దాటి అందాలు ప్రదర్శించలేదు. సహజ సిద్దంగానే కేథరిన్ తన గ్లామర్ లుక్స్ తో యువతని ఆకట్టుకుంటోంది. అతిగా ఎక్స్ పోజింగ్ లేకుండా హాట్ గా కనిపించడం ఈ భామకి తెలుసు. 

click me!