ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం భారీ అంచనాల నడుమ బుధవారం (డిసెంబర్ 4) సాయంత్రం నుంచి థియేటర్స్ లో సందడి మొదలు పెట్టింది. ప్రీమియర్ షోల నుంచే పుష్ప 2 చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ హాఫ్ ని సుకుమార్ ఎక్కువగా డ్రామా, ఎలివేషన్ సీన్లతో ఎంగేజింగ్ గా నడిపించారు. ఇక సెకండ్ హాఫ్ లో కొంత సాగదీసినప్పటికీ జాతర ఎపిసోడ్, క్లైమాక్స్ అదిరిపోయాయి.
మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ అనిపించేలా సుకుమార్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అల్లు అర్జున్ అయితే ప్రతి సన్నివేశం కోసం ప్రాణం పెట్టి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. బన్నీ డెడికేషన్ ని అంతా అభినందిస్తున్నారు. సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి పుష్ప 2 చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఒక పర్సన్ నుంచి మాత్రం బన్నీకి ఎమోషనల్ విషెష్ అందాయి. ఎమోషనల్ గా విషెష్ చెప్పిన వ్యక్తి ఎవరో కాదు.. అల్లు అర్జున్ ముద్దుల కొడుకు అల్లు అయాన్.
అల్లు అయాన్, అల్లు అర్హ ఇద్దరూ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసి ముద్దు ముద్దుగా మాట్లాడారు. తాజాగా అల్లు అయాన్ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా తన చిట్టి చేతులతో లేఖ రాశాడు. అయాన్ రాసిన లెటర్ ని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన కొడుకు రాసిన లెటర్ హృదయాన్ని హత్తుకుంది అని బన్నీ పోస్ట్ చేశాడు. ఇంతకీ అయాన్ లెటర్ లో ఏం రాశాడో ఇప్పుడు చూద్దాం.
మీ సక్సెస్ పట్ల నాకు ఎంత గర్వంగా ఉందో చెప్పేందుకు ఈ లెటర్ రాస్తున్నా నాన్న అంటూ అయాన్ లెటర్ మొదలు పెట్టాడు. ఈరోజు నాకు చాలా ప్రత్యేకం.. ఎందుకంటే ప్రపంచంలోనే ఒక గొప్ప నటుడి సినిమా రిలీజ్ అవుతోంది. నాకు మిక్స్డ్ ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి. పుష్ప 2 సినిమా మాత్రమే కాదు.. సినిమా పట్ల నీకున్న నిబద్ధతని తెలియజేస్తుంది. నా జీవితంలో ఎప్పటికీ నువ్వే హీరో నాన్న. నీకున్న కోట్లాది మంది అభిమానుల్లో నేను ఒకడిని అంటూ అల్లు అయాన్ ఎమోషనల్ గా ప్రస్తావించాడు.
Pushpa 2 twitter review
పుష్ప అంటే ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్ అంటూ అల్లు అర్జున్ డైలాగ్ ని కూడా లెటర్ లో పేర్కొన్నాడు. చిన్న పిల్లాడు రాసిన లేఖ కాబట్టి ఏవైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో అర్థం చేసుకోండి అని అల్లు అర్జున్ కోరారు.