వెంకటేష్ వివాదాలకు దూరంగా ఉండే హీరో. పూర్తిగా ప్రైవేట్ లైఫ్‌కే పరిమితం. బయట చాలా తక్కువగా కనిపిస్తారు. సినిమాలు, ఫ్యామిలీ, రామానాయుడు స్టూడియో అన్నట్టుగా ఉంటుంది. అలాంటి వెంకటేష్‌పై తాజాగా కేసు నమోదైంది. మరో రెండు రోజుల్లో ఆయన హీరోగా నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు కావడం ఆశ్చర్యపరుస్తుంది. మరి వెంకటేష్ ఏంచేశాడు? వారి దగ్గుబాటి ఫ్యామిలీ ఏం చేసింది. వారిపై కేసు ఎందుకు నమోదైందనేది చూస్తే.
ఫిల్మ్ నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వివాదంగా మారింది. దీన్ని కూల్చేసింది దగ్గుబాటి ఫ్యామిలీనే. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బాధితుడిగా ఉన్న నందకుమార్ కి చెందిన దక్కన్ కిచెన్ హోటల్ స్థలం విషయంలో దగ్గుబాటి కుటుంబంతో వివాదం నెలకొంది. ఇది తమది అని వెంకటేష్, సురేష్ బాబులు, వారి ఫ్యామిలీ పట్టుపడుతుంది. కానీ మాది అని నందకుమార్ అంటున్నారు. అందులో హోటల్ కూడా రన్ చేస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితమే(2022 నవంబర్)లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, బౌన్సర్లతో కలిసి హోటల్‌ని పాక్షికంగా కూల్చేశారు.
దీంతో కోర్ట్ ని ఆశ్రయించాడు నందకుమార్. నాంపల్లిలోని సిటీ సివిల్ కోర్ట్ ని ఆశ్రయించగా, ఈ కేసు పెండింగ్‌లో ఉంది. దీనిపై హైకోర్ట్ ని ఆశ్రయించగా, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్ట్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ శనివారం హోటల్ మొత్తాన్ని కూల్చేశారు. దీంతో నాంపల్లి కోర్ట్ వెంకటేష్‌కి, సురేష్ బాబు దగ్గబాటి ఫ్యామిలీకి షాకిచ్చింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చి వేతలో కోర్టు ఆదేశాలను పాటించని దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లిలోని 17వ నంబరు కోర్టు ..ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.