మెగాస్టార్ చిరంజీవి చిన్న విలన్ వేషాలు వేస్తూ ఇప్పుడు మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారు. 40 ఏళ్ళకి పైగా టాలీవుడ్ ని చిరంజీవి శాసించారు. ఈ క్రమంలో చిరంజీవి ఎందరో హీరోయిన్లతో కలసి నటించారు. చిరంజీవితో ఎక్కువగా సినిమాలు చేసిన హీరోయిన్ల జాబితాలో రాధా, రాధిక, సుమలత, సుహాసిని, విజయశాంతి లాంటి వారు ఉంటారు.
వీరిలో చిరంజీవికి బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరనే ప్రశ్న ఎదురైంది. ఇది చిరంజీవిని ఇరకాటంలో పెట్టే ప్రశ్న. కానీ చిరంజీవి తెలివి సమాధానం ఇస్తూ ఒక్కో హీరోయిన్ కి ఒక్కో గొప్ప లక్షణం ఉందని తెలిపారు. అయినప్పటికీ అందరికంటే ఎక్కువ ఇష్టం ఉన్న హీరోయిన్ పేరుని చిరు ఓపెన్ గా చెప్పేశారు. చిరంజీవి ఒక టీవీ షోలో పాల్గొంటుండగా ఈ ప్రశ్న ఎదురైంది. చిరంజీవితో నటించిన రాధిక, సుమలత స్క్రీన్ పైకి వచ్చి చిరంజీవితో మాట్లాడారు. రాధిక అయితే నా ఫేవరెట్ హీరో చిరంజీవి అని తెలిపింది. చిరుని సరదాగా బెదిరిస్తూ.. చిరు నీకు కూడా ఇష్టమైన హీరోయిన్ నేనే.. ఆ విషయం నువ్వు అందరి ముందు చెప్పాలి అని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఆమె మాటలకు చిరంజీవి సరదాగా నవ్వుకున్నారు.
sumalatha
సుమలత కూడా చిరంజీవితో మాట్లాడారు. మీతో కలసి నటించిన క్షణాలు ఎప్పటికీ మరచిపోలేను అని సుమలత తెలిపింది. మీతో స్నేహం కూడా గొప్ప అనుభూతిని ఇచ్చింది అంటూ సుమలత పేర్కొన్నారు. ఆ తర్వాత చిరంజీవి తనకి ఇష్టమైన హీరోయిన్ గురించి చెప్పారు. నాతో నటించిన హీరోయిన్లలో ఒక్కొక్కరిలో ఒక్కో గొప్ప లక్షణం ఉంది. హీరోయిన్ రాధా నీతో కలసి చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. అందం విషయంలో శ్రీదేవి బెస్ట్. అప్పట్లో హోమ్లీ పాత్రలో చేయాలంటే సుమలత బెస్ట్ ఛాయిస్. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో క్వాలిటీ ఉంటుంది.. ఆ క్వాలిటీస్ కి నేను దాసోహం అని చిరంజీవి అన్నారు.
వీళ్లందరికంటే రాధిక అంటే ఎక్కువ ఇష్టం అని చిరంజీవి తెలిపారు. మహానటి సావిత్రి, వాణిశ్రీ, జయసుధ తర్వాత ఆ స్థాయి ఉన్న నటి రాధిక అని చిరంజీవి తెలిపారు. రాధికకి నటనలో లిమిటేషన్స్ లేవు. ఎమోషనల్ గా నటించగలదు, కామెడీ చేయగలదు, మాస్ గా కనిపిస్తుంది, క్లాస్ గా కూడా కనిపిస్తుంది అంటూ వర్ణించారు. కాబట్టి రాధిక అంటే తనకి ఎక్కువ ఇష్టం అని చిరంజీవి తెలిపారు.
కానీ చిరంజీవి ఒక క్రేజీ హీరోయిన్ పేరు మరచిపోయారు. రాధిక, రాధా తరహాలోనే చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్ విజయశాంతి. విజయశాంతి చిరంజీవికి నటనలో, డ్యాన్స్ లో ఎంతలా పోటీ ఇచ్చిందో చూశాం. కానీ విజయశాంతి పేరు చెప్పలేదు.