కిరణ్ అబ్బవరం కి అల్లు అర్జున్ బహిరంగ క్షమాపణ. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..?

First Published | Nov 19, 2024, 7:22 PM IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కి సారి చెప్పాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సారి బ్రదర్ అంటూ ట్వీట్ చేశాడు. కారణం ఏంటో తెలుసా..? ఎందుకు సారి చెప్పాడో తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకీ ఆ కథేంటంటే..? 
 

Allu Arjun, #Pushpa2, sukumar

అల్లు అర్జున్ పుష్ప2 కోసం దేశ వ్యాప్తంగా ఆడియన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 5 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు.  పుష్ప 2 థియేట్రికల్ ట్రైలర్ ఇలా విడుదలయ్యిందో లేదో.. అలా భారీ రెస్పాన్స్ ఎదురవుతోంది. కామన్  ఆడియన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే..? 

Also Read: కొడుకు గుగన్ దాస్ వింత అలవాటు గురించి శివ కార్తికేయన్ చెప్పిన సీక్రెట్
 

అయితే కామన్ ఆడియన్స్ నుంచి మాత్రమే కాకుండా.. సెలబ్రెటీస్ నుంచి కూడా ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చాలామంది స్టార్స్ పుష్ప2 ట్రైలర్ ను చూసి.. వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి కూడా ఈ ట్రైలర్ చూసి.. స్పందింాచరు. అల్లు అర్జున్ తో పాటు సుకుమార్ పై కూడా ప్రశంసలు కురిపించారు. 


ఇలా ఎంతో మంది దర్శకులు, హీరోలు, హీరోయిన్లు పుష్ప2 ట్రైలర్ పై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో  వారిలో టాలీవుడ్  యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఉన్నాడు. పుష్ప2  ట్రైలర్ ని చూసిన వెంటనే ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.  వైల్డ్ ఫైర్ అంటూ ట్వీట్ చేశారు. దాంతో అందరికి రిప్లై ఇస్తూ వచ్చిన అల్లు అర్జున్.. కిరణ్ అబ్బవరానికి కాస్త లాంగ్ మెసేజ్ పెట్టారు. 
 

ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా..? కిరణ్ కు బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పారు.  అల్లు అర్జున్ స్పందిస్తూ చాలా థాంక్యూ మై డియర్ బ్రదర్..అదే విధంగా నీకు కూడా శుభాకాంక్షలు . ‘క’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భాగా నీకు బెస్ట్ విషెస్.. కానీ నువ్వు నన్ను ఒక విషయంలో క్షమించాలి.. పుష్ప 2  షూటింగ్ లో బిజీ గా ఉండడం వాళ్ళ నీ సినిమాని చూడలేకపోయాను. కానీ వీలు చూసుకొని కచ్చితంగా చూస్తాను. సినిమా ఎలా ఉందో చెప్పాడానికి తప్పకుండా  నీకు కాల్ చేస్తాను అని చెప్పుకొచ్చాడు. 
 

ఇక  ఈ కామెంట్ కి  స్పందించారు కిరణ్ అబ్బవరం.. బన్నీ ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. ఇలా అన్నారు థాంక్యూ వెరీ మచ్ అన్నా..డిసెంబర్ 5 కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక వీళ్లిద్దరు ఎక్స్ వేదికగా చేసుకున్న ఈ చాట్ ను వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అంతే కాదు బన్నీ అంతటి స్టార్ హీరో కిరణ్ కు ఇలా సారి చెప్పడంతో.. ఆయన సంస్కారాన్ని మెచ్చుకుంటున్నారు. 
 

తనకంటే చిన్న స్థాయి హీరోలను అలా ప్రోత్సహించడం తో ఐకాన్ స్టార్ ను మెచ్చుకుంటున్నారు. ఇక పుష్ప2కు సబంధించిన షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని తెలుస్తోంది. రీసెంట్ గా శ్రీలీల ఐటమ్ సాంగ్ ను షూట్ చేశారు టీమ్. ఇక బన్నీ, రష్మిక డ్యూయెట్ ను సారధి స్టూడియోలో షూటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు పుష్పకు సబంధించిన క్లైమాక్స్ సీన్ కూడా కొంత భాగం షూటింగ్ పెండింగ్ ఉందట. 

మరి డిసెంబర్ 5 ముందే ఫస్ట్ కాపీ ని సిద్ధం చేయాలి.. రెండు మూడు రోజుల ముందే ఫారెన్ లో ప్రీమియర్స్ కు పంపించాలి. మరి ఇలా సాధ్యం అయ్యే పనేనా.. సుకుమార్ ఏం చేయబోతున్నాడు..? సినిమా ఏం తేడా కొట్టదు కదా అంటూ భయపడుతున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఏం చేయబోతున్నారో.

Latest Videos

click me!