సామాన్యులకే కాదు.. కొన్ని కొన్ని విషయాలలో సెలబ్రిటీలకు కూడా రక్షణలేకుండా పోతోంది. వారికి కూడా తిప్పలు తప్పడంలేదు. ఇలాంటి సంఘటన రీసెంట్ గా బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ కు అనుభవం అయ్యింది.
సామాన్యుల మాదిరి సెలబ్రిటీలకు కూడా కొన్ని తిప్పలు తప్పవు. యాక్టర్స్, సెలబ్రిటీలకు కూడా కొన్నిసార్లు తిప్పలు తప్పవు. కాకపోతే సందర్భం వేరు కావచ్చు కాని... ఏదో ఒక రకంగా సెలబ్రిటీలు ఇబ్బందులు పడ్డ సందర్భాలుచాలా ఉన్నాయి. ఈక్రమంలో బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.
27
Image: Urfi Javed / Instagram
సోషల్ఉమీడియా లో స్టార్ గా వెలుగు వెలుగుతున్న నటి ఉర్ఫీ జావేద్ కు ఇలా ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా నెట్టింట్లో వెల్లడించింది. అందరితో పంచుకుంది. ఇంతకీ అసలు ఆమెకు ఏమైందంటే.. ఓ క్యాబ్ డ్రైవర్ చేతిలో మోసపోయింది బ్యూటీ.
37
దిల్లీలో తను ఉంటున్న ఏరియా నుంచి ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది ఉర్ఫీ. దారి మధ్యలో చిన్న పని ఉండటంటో ఒక దగ్గర ఆపగా.. ఆమె ఆ పని చూసుకుంటుండగా.. ఈ క్రమంలోనే ఆ డ్రైవర్ ఆమె లగేజీతో కాస్త ఉడాయించాడని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలను ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.
47
ఇక సోషల్ మీడియాలో ఉర్ఫా జావేద్ ఏం రాసుకొచ్చిందంటే.. ఈ రోజు నాకు వరస్ట్ ఎక్స్ పీరియెన్స్ జరిగింది. ట్యాక్సీ డ్రైవర్ నా లగేజీతో మాయమైపోయాడు. దాదాపు రెండు గంటల తర్వాత వచ్చాడు కానీ అప్పటికే ఫుల్ తాగేసి ఉన్నాడు. ఉబర్.. మీరు అమ్మాయిల విషయంలో కాస్త సేఫ్టీ తీసుకోవాలి అని ఉర్ఫీ రాసుకొచ్చింది.
57
urfi javed
ఇక దీనిపై స్పందిస్తున్న పలువురు నెటిజన్స్.. కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది పాజిటీవ్ గా.. మరికొంత మంది నెగెటీవ్ గా స్పందిస్తున్నారు. మంచి ఎక్స్ పీరియెన్స్. నీకు ఇలా జరగాల్సిందే అని ఒకరు అంటే.. మెట్రో యూజ్ చేయ్. చాలామంది ప్రజలు నీతో సెల్ఫీలు తీసుకుంటారు అని మరొకరు కామెంట్ చేశారు. ఆటోలు చాలా బెస్ట్. నెక్స్ టైమ్ ఆటో బుక్ చేసుకో అని ఇంకొకరు కామెంట్స్ చేస్తున్నారు.
67
urfi javed
ఇక ఈమెపై డ్రస్సింగ్ విషయంలో రకరకాలుగా ట్రోల్స్ కూడా ఫేస్ చేస్తుంటుంది. రీసెంట్ గా జీన్స్ ఫ్యాంట్ ను టాప్ గా మార్చి వేసుకుంది ఉర్పీ... ఈ విషయంలో విమర్షలు ఎదుర్కోంది. అంతే కాదు తనను విమర్షించేవారికి గట్టిగా కౌంటర్స్ కూడా వేస్తుంటుంది ఉర్ఫీ.బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న ఉర్ఫీ.. పలు సాంగ్స్, యాడ్స్ లో నటిస్తూ బిజీగా ఉంది.
77
Image: Urfi Javed / Instagram
బిగ్ బాస్ ఓటీటీ హిందీ సీజన్ లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది ఉర్ఫీ జావేద్. షో తర్వాత సోషల్ మీడియాపై పడింది. అక్కడ ఫాలోయింగ్ పెంచుకోవడమే పనిగా పెట్టుకుంది. తనదైన స్టైల్లో హాట్ హాట్ డ్రస్సింగ్ స్టైల్ తో ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంటూనే ఉంది. అసలు ఊహకే అందని విధంగా రకరకాల వస్తువులతో డిజైన్స్ చేయిస్తూ బికినీ, డ్రస్సులు వేసుకుంటూ ఉంటుంది.