మేము ప్రాణ స్నేహితులం, కాని సౌందర్య చనిపోయినప్పుడు వెళ్లలేదు.. సీనియర్ నటి ఆమని షాకింగ్ కామెంట్స్

Published : Feb 22, 2023, 12:19 PM IST

90 దశకంలో తెలుగు తెరను ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో ఆమని కూడా ఒకరు. స్టార్ హీరోల సరసన మెరిసిన ఈ సీనియర్ బ్యూటీ.. అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ..ఎమోషనల్ అయ్యారు. 

PREV
17
మేము ప్రాణ స్నేహితులం, కాని సౌందర్య చనిపోయినప్పుడు వెళ్లలేదు.. సీనియర్ నటి ఆమని షాకింగ్ కామెంట్స్

హీరోయిన్ గా వెండితెరపై వెలుగు వెలిగింది ఆమని. దాదాపు పదేళ్లు.. స్టార్ హీరోల సినిమాలలో సందడి చేసింది బ్యూటీ. ఆతరువాత కొన్నాళ్ళు వెండి తెరకు దూరంగా ఉన్న ఆమని.. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయింది ఆమని. 

27

హీరోయిన్ గా గ్లామర్ పాత్రల్లో ఎలా మెరిసిందో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అమ్మ.. అత్త పాత్రల్లో అంతే పద్దతిగా కనిపిస్తోంది సీనియర్ స్టార్. హీరోలకు, హీరోయిన్లకు తల్లి పాత్రల్లో కనిపిస్తుంది. ఇక రీసెంట్ గా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ  ఇచ్చిన ఆమని.. చాలా విషయాలు పంచుకున్నారు. అప్పటి రోజులను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. 
 

37

ముఖ్యంగా ఇతర హీరోయిన్లతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆమని. అందరిమధ్య ఎంత హెల్దీ కాంపిటేషన్ ఉండేదో వివరిస్తూ.. హీరోయిన్ సౌందర్యను గుర్తు చేసుకుని బాధపడ్డారు. ఆమె గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు ఆమని. 

47

 తాజా ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ .. సౌందర్య .. నేను ఎంతో స్నేహంతో ఉండే వాళ్లం. ఇద్దరం కలిసి కొన్ని సినిమాల్లో చేశాము. ఒకరి విషయాలను ఒకరం చెప్పుకుంటూ ఉండేవారం. అలాంటి సౌందర్య చనిపోయినప్పుడు నేను వెళ్ళలేకపోయాను. వెళ్లే ధైర్యం కూడా చేయలేకపోయాను.  అప్పుడు నేను  ఒక సినిమా షూటింగులో ఉన్నాను అన్నారు. 

57

సౌందర్య మరణ వార్త  తెలియగానే నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది. ఆమెను అలా చూడగనో లేదో అని భయం వేసింది. అందుకే   వెళ్లలేదు అని చెప్పారు ఆమని. అంతే కాదు . సౌందర్య చనిపోయిన ఒక నెలకి వాళ్ల ఇంటికి వెళ్లాను .. ఆమె అమ్మతో మాట్లాడాను. సౌందర్య లేని ఆ ఇంటినీ .. ఆమె ఫొటో దగ్గర పెట్టిన పూలను చూడలేకపోయాను అని బాధపడ్డారు ఆమని. 

67

ఇక సౌందర్య అమ్మగారిని చూసి నేను తట్టుకోలేకపోయాను..  ఆమెని ఓదార్చే శక్తి కూడా అప్పుడు నాకు లేదుఅన్నారు. అంతే కాదు.. సౌందర్య చనిపోయే ముందు కొంత కాలం క్రింత  కొత్త ఇంట్లోకి మారారు. ఆ ఇంట్లోకి మారిన తరువాతే  ఇలా జరిగిందంటూ ఆమె తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. నా జీవితంలో  నన్ను బాగా కదిలించివేసిన సంఘటనల్లో సౌందర్య మరణం ఒకటి అంటూ ఎమోషనల్ అయ్యారు ఆమని.  

77

ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఈవీవీగారు నా గురువు అనే చెబుతాను. ఆయన వల్లనే నేను నిలబడగలిగాను. అలాంటి ఈవీవీ గారు పోయినప్పుడు నేను రాలేకపోయాను. అప్పుడు నేను ఇక్కడ లేకపోవడమే అందుకు కారణం అన్నారు ఆమని. తన ఎదుగుదలకు సహకరించిన ప్రతీ ఒక్కరిని జీవితంలో మర్చిపోనన్నారు ఆమని.  

click me!

Recommended Stories