Butta Bomma Movie Review: బుట్ట బొమ్మ సినిమా ప్రీమియర్ రివ్యూ, మూడు ముక్కల ప్రేమ కథ

First Published | Feb 4, 2023, 9:23 AM IST

అనిఖ సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రల్లో... శౌరి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమా బుట్టబొమ్మ.  సితార నాగవంశీ - త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించిన ఈమూవీ ఈరోజు రిలీజ్అవుతుండగా.. యూఎస్ లో ముందుగానే ప్రీమియర్స్ సందడి చేశాయి. మరి ఈసినిమా ఎలా ఉంది..ప్రీమియర్ టాక్ చూద్దాం. 
 

 రొమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ గా తెరకెక్కింది బుట్ట బొమ్మ సినిమా.. ఈసినిమాను సితార నాగవంశీ నిర్మించడం విశేషం కాగా.. బుట్ట బొమ్మ సినిమాలో.. అనిఖ సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటించారు.  శౌరి చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు. మరి ఈసినిమా ప్రీమిచర్ టాక్ ఎలా ఉందో చూద్దాం. 

గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా  గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథతో తెరకెక్కింది. ఇద్దరి మధ్య చక్కగా సాగే ప్రేమను  అల్లకల్లోలం చేసే పాత్రలో అర్జున్ దాస్ నటించాడు.  ఈ మూడు పాత్రల చుట్టూనే బుట్టబొమ్మ  ప్రధాన కథ తిరుగుతుంది.
 

Latest Videos


అరకులో సాగే కథ ఇది.  అద్భుతమైన పల్లె అందాల నడుమ ఓ అమ్మాయి అనేఖా సురేంద్రన్. ఆమెకు తండ్రి అంటే భయం. గీత దాటి ఏపని చేయాలన్నా భయం.. అటువంటి సమంయంలోనే..  ఫోనులో పరిచయమవుతాడు హీరో.  హీరో ఓ ఆటో డ్రైవర్.. అబ్బాయి సూర్య వశిష్టతో ఓ సందర్భంలో పోన్ లో  మాట్లాడుతుంది.. మనసుకు నచ్చడంతో.. చనువు పెరిగి వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమలో పడతారు. ఆ తర్వాత కలిసి తిరుగుతారు. 
 

ఈక్రమంలో విలన్ పాత్రలో నటించిన  అర్జున్ దాస్ కంటపడతారు వీరు. క్రూర స్వభావం ఉన్న  అతడికి ఆ ప్రేమ నచ్చదు. వారి ప్రేమను నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు.  అతడిని నుంచి తప్పించుకోవాలని ఇంటి నుంచి పారిపోతారు  హీరో హీరోయిన్ . మరి బయటకు వెళ్ళినవారు తమప్రేమను గెలిపించుకున్నారా..? ఇంతకీ అర్జున్ దాస్ కు వీరి ప్రేమంటే కోపం ఎందుకు..? క్లైమాక్స్  ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 
 

బుట్ట బొమ్మ సినిమా విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ మూవీ తేలిపోయిందనే చెప్పాలి. చాలా సరళంగా సాగిపోయింది సినిమా. ఆడియన్స్ ఎక్స్ పెక్ట్నేషన్స్ అందుకోలేకపోయింాి సినిమా. ఈ మూవీలో ముందుగా ఊహించినంత...కథకుసరిపోను వినోదం లేదు. ఉత్కంఠ లేదు.. మొదటి బాగం కథ అంతా కాస్త చప్పగా సాగుతుంది.ఇక అంతా ఎదుురు చూసే  ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చేర్చారు. చిన్న చిన్న టెన్షన్ మూమెంట్స్ ఉన్నాయి, సెకండాఫ్ కోసం ఎదురుచూసేలా చేస్తుంది.

బుట్టా బొమ్మ సెకండ్ పార్ట్ మూవీ మాత్రం కాస్త  మెరుగ్గా అనిపించినట్టు తెలుస్తోంది. అయితే ఫస్ట్ హాఫ్ తేలిపోవడంతో సెకండ్ హాఫ్ సినిమాపై చాలా వరకూ ఇంట్రెస్ట్ పోతుంది. అంతే కాదు డైలాగ్స్, స్క్రీన్ ప్లే విషయంలో కూడా పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదని తెలుస్తోంది. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, డైలాగ్ డెలివరీ మాత్రం సినిమాకే  హైలైట్ అని చెప్పాలి. 
 

సినిమాలో కొన్ని కొన్ని డైలాగ్స్ అద్భుతంగా పేలాయి.. సొంగ తుడుచుకో చెల్లి అవుతుంది...'', ''ఈడొచ్చిన దానివి ఇంట్లో పడి ఉండు. ఎవడి కంట్లోనూ పడకు'' లాంటి డైలాగ్స్ గట్టిగా పేలాయి.. హీరో హీరోయిన్ తో పాటు.. విలన్ పాత్రలో అర్జున్ దాస్ ప్రత్యేకంగా కనిపించాడని చెప్పాలి. ఆర్టిస్ట్ లంతా బాగా నటించారు. కొత్తవారు కూడా అనుభవం ఉన్నవారిలా నటించారు. 

మొత్తానికి సినిమా అంతా కాస్త చప్పగా.. అక్కడక్కడా తియ్యగా.. బాగుంది అనుకునేలోపు మళ్ళీ చేదుగా.. ఇలా సినిమా చూడటానికి వెళ్ళిన ప్రేక్షకుడికి రకరకాల అనుభూతులను పంచిఇస్తుంది. పర్ఫెక్ట్ గా తీయగలిగితే.. ఇంకాస్త అద్భుతంగా వచ్చేదేమో అనిపించేలా ఉంటుందని ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ అంటున్నారు. మరి సినిమా రిలీజ్ అయ్యి.. ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి. 

అనేఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ, నవ్యా స్వామి ప్రధాన పాత్రలో నటించగా.. పుష్ప జగదీష్, ప్రేమ్ సాగర్, రాజ్ తిరందాసు, 'మిర్చి' కిరణ్, నర్రా శ్రీనివాస్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ : వంశీ పచ్చిపులుసు, డైలాగ్స్ : గణేష్ కుమార్ రావూరి, ఎడిటింగ్ : నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ : వివేక్ అన్నామలై, నిర్మాతలు: ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య, దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్ రమేష్. 
 

అనేఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ, నవ్యా స్వామి ప్రధాన పాత్రలో నటించగా.. పుష్ప జగదీష్, ప్రేమ్ సాగర్, రాజ్ తిరందాసు, 'మిర్చి' కిరణ్, నర్రా శ్రీనివాస్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ : వంశీ పచ్చిపులుసు, డైలాగ్స్ : గణేష్ కుమార్ రావూరి, ఎడిటింగ్ : నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ : వివేక్ అన్నామలై, నిర్మాతలు: ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య, దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్ రమేష్. 
 

click me!