తనపై దుష్ప్రచారం చేసిన సోషల్ మీడియా, ప్రధాన మీడియా సంస్థలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీస్ ఇచ్చారు. తన విడాకులపై, తన కుటుంబంపై అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేసేలా ఉన్న వార్తలు, సోషల్ మీడియా పోస్టులను, వీడియోలు డిలీట్ చేయాలని రెహమాన్ డిమాండ్ చేశారు.
24 గంటల్లోగా తనపై జరిగిన దుష్ప్రచారానికి సంబంధించిన కంటెంట్ ఏ రూపంలో ఉన్నా మొత్తం తొలగించకపోతే భారతీయ న్యాయ సంహితలోని 356 సెక్షన్ కింద పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరిస్తూ ఏఆర్ రెహమాన్ తరపు న్యాయవాది బహిరంగ నోటీసులు విడుదల చేశారు.