Published : Aug 08, 2024, 10:33 AM ISTUpdated : Aug 08, 2024, 10:42 AM IST
పల్లవి ప్రశాంత్ వలన బిగ్ బాస్ మేకర్స్ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారట. ఇది హౌస్లోకి వెళ్లాలనుకునే ఓ వర్గానికి ఊహించని దెబ్బ. ఇంతకీ బిగ్ బాస్ నిర్వాహకులు తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటో చూద్దాం..
పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్ విన్నర్ గా నిలిచాడు. 2023 డిసెంబర్ 17న ఫినాలే కాగా... పల్లవి ప్రశాంత్ అభిమానులు భారీగా అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడులు చేసుకున్నారు. అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు రాకముందే పరిస్థితి అదుపు తప్పింది.
25
Pallavi Prashanth
అల్లరి మూకలు ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. ప్రాపర్టీ డామేజ్ చేశారు. దాంతో పల్లవి ప్రశాంత్ కి పోలీసులు సూచనలు చేశారు. ఎలాంటి ర్యాలీ చేయకుండా ఇంటికి వెళ్లిపోవాలని వెనక డోర్ నుండి పంపించారు. పోలీసుల మాట లెక్క చేయని పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేశాడు.
35
Pallavi Prashanth
ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. రెండు రోజుల తర్వాత బెయిల్ పై పల్లవి ప్రశాంత్ విడుదల అయ్యాడు. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలవడానికి సింపథీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. అతడి సింపథీ డ్రామాల వలన కప్ గెలిచాడు. అదే సమయంలో ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానని మాటిచ్చాడు.
45
Pallavi Prashanth
కానీ ఇచ్చిన మాట ప్రకారం ప్రైజ్ మనీ పంచలేదు. బిగ్ బాస్ షో ముగిసి 7 నెలలు అవుతుంది. ఇప్పటికి కేవలం రూ. 1.20 లక్షలు మాత్రమే పంచాడు. పల్లవి ప్రశాంత్ రూ. 16 లక్షలు పంచాలి అనేది ఒక అంచనా. పల్లవి ప్రశాంత్ సాయం విషయంలో కూడా మాట తప్పాడు. ఇది బిగ్ బాస్ ఇమేజ్ కూడా డ్యామేజ్ చేసింది. ఈ క్రమంలో బిగ్ బాస్ మేకర్స్ ఒక నిర్ణయం తీసుకున్నారట.
55
Pallavi Prashanth
ఇకపై సామాన్యులను బిగ్ బాస్ షోకి ఎంపిక చేయకూడదని డిసైడ్ అయ్యారట. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లాలని చాలా మంది కలలు కంటారు. కామనర్ కోటాలో ప్రయత్నం చేసి హౌస్లోకి వెళ్లాలని ఆశపడే నాన్ సెలెబ్స్ ఆశల మీద నీళ్లు చల్లినట్లే అని చెప్పొచ్చు. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు 8లో సామాన్యులకు ఛాన్స్ లేదంటున్నారు.