బిగ్‌ బాస్‌ సోహైల్‌ని నిలువునా ట్రోల్‌ చేసిన బుల్లెట్‌ భాస్కర్‌.. బాబోయ్‌ ఇదెక్కడి అరాచకం.. ఇంతగా గెలికాడేంటి?

Published : Mar 12, 2024, 10:32 AM IST

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సోహైల్‌ హీరోగా ఇటీవల ఓ సినిమా చేయగా అది పెద్దగా ఆడలేదు. దీంతో కన్నీళ్లు పెట్టుకుంటూ రచ్చ చేశాడు. ఇప్పుడు దాన్ని స్పూఫ్‌తో ట్రోల్‌ చేశాడు బుల్లెట్‌ భాస్కర్‌.   

PREV
18
బిగ్‌ బాస్‌ సోహైల్‌ని నిలువునా ట్రోల్‌ చేసిన బుల్లెట్‌ భాస్కర్‌.. బాబోయ్‌ ఇదెక్కడి అరాచకం.. ఇంతగా గెలికాడేంటి?

జబర్దస్త్‌ కమెడియన్‌ బుల్లెట్‌ భాస్కర్ తనదైన కామెడీతో మెప్పిస్తున్నాడు. స్టార్‌ కమెడియన్‌గా రాణిస్తున్నాడు. అయితే ఇటీవల ఆయన సినిమాల  స్పూఫ్‌ లతో నవ్వులు పూయిస్తున్నాడు. మహేష్‌బాబు, పవన్‌ కళ్యాణ్‌, ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోల సినిమాల్లోని సీన్లని స్ఫూఫ్‌ చేస్తూ కామెడీ పంచుతున్నాడు. 

28

తాజాగా ఆయన ఇలాంటి స్పూఫ్‌లతో మరోసారి రెచ్చిపోయాడు. ఈ సారి బుల్లెట్‌ భాస్కర్‌ ఏకంగా బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌, హీరో సోహైల్‌ని టార్గెట్‌ చేశాడు. జబర్దస్త్ వేదికపై అందరి ముందు ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. ఓ వైపు ట్రోలింగ్‌, మరోవైపు ర్యాగింగ్‌ చేస్తూ రచ్చ రచ్చ చేశాడు. ఇంతకి ఆయన చేసిన స్పూఫ్‌ ఏంటనేది చూస్తే.. 
 

38

ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. ఇందులో బిగ్‌ బాస్‌ సోహైల్‌ని స్పూఫ్‌తో స్కిట్‌ చేశాడు. ఆ మధ్య సోహైల్‌ హీరోగా `బూట్‌ కట్‌ బాలరాజు` అనే సినిమా విడుదలైంది. ఈ మూవీని జనం ఆదరించలేదు. దీంతో థియేటర్‌కి వెళ్లిన సోహైల్‌ తన సినిమాని ఎవరూ చూడటం లేదని వాపోయాడు. థియేటర్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

48

బిగ్‌ బాస్‌ లో ఉన్నప్పుడు జై సోహైల్‌ అన్నారు, బాగా చేస్తున్నావని ఎంకరేజ్‌ చేశారు, ఎంతో ఆదరించారు. ఇప్పుడు సినిమా చేస్తే ఎందుకు చూడటం లేదని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ రాయలసీమతోపాటు జిల్లాల పేర్లు మెన్షన్‌ చేస్తూ వారంతా సినిమా చూడాలని వేడుకున్నాడు. ఫ్యామిలీ, ఎమోషన్స్‌, సెంటిమెంట్‌, కామెడీ, యాక్షన్‌ ఉంది, మంచి ఫ్యామిలీ మూవీ అని, ఇలాంటి సినిమాని కూడా ఎంకరేజ్‌ చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించాడు. 
 

58

ఎంతో కష్టపడి సినిమా చూశామని, ప్రమోషన్‌కి డబ్బులు లేవని తెలిపాడు. అంతేకాదు ఇకపై తాను లిప్‌ కిస్సులు, రొమాన్స్ ఉన్న సినిమాలే చేస్తానంటూ వాపోయాడు. పక్కనే ఉన్న అవినాష్‌.. అతన్ని ఎంతగానో ఓదార్చాడు. సినిమాని చూస్తారని చెప్పారు. సోహైల్‌కి అవినాష్‌ అండగా నిలిచి ఓదార్చాడు. ఆడియెన్స్ ని రిక్వెస్ట్ చేశాడు. 
 

68

ఈ సంఘటనని స్కిట్‌గా మల్చుకున్నాడు బుల్లెట్‌ భాస్కర్‌. తనదైన స్టయిల్‌లో రెచ్చిపోయాడు. ప్రారంభంలో హీరోగా స్టయిల్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హడావుడి చేశాడు. సినిమా రిలీజ్‌ అయ్యాక రెస్పాన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. సినిమాని చూడండన్నా, జబర్దస్త్ లో ఉన్నప్పుడు తెగ ఎంకరేజ్‌ చేశారు, జై బుల్లెట్‌ భాస్కర్‌ అన్నారు, ఇప్పుడు సినిమా చేస్తే చూడటం లేదు ఎందుకన్నా అంటూ రచ్చ చేశాడు. 
 

78

సోహైల్‌ లాగే మూడు ప్రాంతాల పేర్లు, ముఖ్యంగా జిల్లాల పేర్లు చెబుతూ, కన్నీళ్లు పెట్టుకుంటూ నానా రచ్చ చేశాడు. ఇక ఇందులో వెనకాల అమ్మాయిగా సత్య కనిపించగా, పక్కన ఓదార్చే అవినాష్‌ పాత్రని నరేష్‌ తీసుకున్నాడు. తనదైన ఫన్నీ స్టయిల్‌లో ఓదార్చాడు. ఇది ఇప్పుడు స్కిట్‌లోనే హైలైట్‌గా నిలిచింది. 
 

88

అయితే సోహైల్‌ని మక్కీకి మక్కి దించేశాడు బుల్లెట్‌ భాస్కర్‌. అయితే అది మామూలు ట్రోలింగ్‌ కాదు. సోహైల్‌ చేసిన పనికి అప్పుడే దారుణంగానెటిజన్లు ట్రోల్‌ చేశారు. ఇప్పుడు బుల్లెట్‌ భాస్కర్‌ షో వేదికగా అందరి ముందు సోహైల్‌ని ఆడుకోవడం గమనార్హం. ఇది ట్రోలింగ్‌ మాత్రమే కాదు పెద్ద ర్యాంగింగ్‌ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సోహైల్‌ని ఇలా ఆడుకుంటున్నాడేంట్రా అని పోస్ట్ చేస్తున్నారు. బుల్లెట్‌ భాస్కర్‌ మామూలోడు కాదంటూ కితాబిస్తున్నారు. మొత్తంగా ఈ ప్రోమో వైరల్‌ అవుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories