రష్మీ, హైపర్ ఆది ఇద్దరూ ఏదో విధంగా తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. జబర్దస్త్ తో పాటు రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా యాంకర్ గా చేస్తోంది. ఇక జబర్దస్త్ లో ఆటో రాంప్రసాద్ తన పంచ్ డైలాగ్స్ తో సందడి చేస్తుంటాడు. జబర్దస్త్ లో బూతు కామెంట్స్, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువవుతున్నాయని ఇటీవల ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయి. సుధీర్, హైపర్ ఆది ఈ విషయంలో గతంలో విమర్శలు ఎదుర్కొన్నారు.