Sreemukhi
అనతి కాలంలో స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ శ్రీముఖి. ప్రస్తుతం టాప్ యాంకర్స్ లో ఆమె ఒకరు. షోలు పరంగా చూస్తే మొదటి స్థానంలో ఉంది.
Sreemukhi
గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. బుల్లితెర ఆడియన్స్ హాట్ ఫేవరేట్ యాంకర్ అయ్యారు. శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్న షోలు మంచి టీఆర్పీ రాబడుతున్నాయి.
Sreemukhi
శ్రీముఖి పటాస్ షోతో వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 3లో ఛాన్స్ దక్కించుకుంది. హౌస్లో సత్తా చాటిన శ్రీముఖి టైటిల్ రేసులో నిలిచింది. ఆ సీజన్ రన్నర్ గా నిలిచింది. టైటిల్ కోల్పోయినా రెమ్యూనరేషన్, ఫేమ్ రాబట్టింది.
Sreemukhi
అటు వెండితెర మీద కూడా సందడి చేస్తుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో శ్రీముఖి కీలక రోల్స్ చేసింది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించడం విశేషం.
Sreemukhi
గత ఏడాది విడుదలైన భోళా శంకర్ మూవీలో చిరంజీవితో రొమాన్స్ చేసింది. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి లో నడుము చూసే సన్నివేశాలు స్పూఫ్ చేశారు చిరంజీవి, శ్రీముఖి.
హీరోయిన్ గా శ్రీముఖికి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఆచి తూచి ఎంచుకుంటుంది. మంచి సబ్జక్ట్స్ లో నటించడం ద్వారా నటిగా స్థిరపడాలని ఆమె కోరిక అట. అనసూయ సైతం ఒక ఇమేజ్ తెచ్చుకుని టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ అయ్యారు.