చీరకట్టిన ‘బ్రో’ బ్యూటీ.. శారీలోనూ కేతికా శర్మ కిర్రాక్ ఫోజులు.. ఏమాత్రం తగ్గట్లేదుగా..

First Published | Jul 27, 2023, 6:01 PM IST

యంగ్ బ్యూటీ కేతికా శర్మ చాలా రోజుల తర్వాత చీరకట్టులో దర్శనమిచ్చింది. ట్రెండీ వేర్స్ లో అందాల సునామీ తెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా సంప్రదాయ దుస్తుల్లో బ్యూటీఫుల్ గా మెరిసింది. 
 

టాలీవుడ్ యంగ్ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma) తెలుగు సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది. తన కెరీర్ టాలీవుడ్ లోనే ప్రారంభమైన విషయం తెలిసిందే. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఇక్కడే అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. 
 

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు యంగ్ హీరో ఆకాశ్ పూరి సరసన కేతికా శర్మ నటించిన విషయం తెలిసిందే. ‘రొమాంటిక్’ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో కేతికా హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. 


అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోవైపు తొలిసినిమాతోనే రొమాన్స్ సీన్లలో రెచ్చిపోయి నటించింది. ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసింది. యూత్ లో కాస్తా గుర్తింపు దక్కించుకుంది. దాంతో మరిన్నీ ఆఫర్లు అందుకుంది. 
 

ఆ తర్వాత వచ్చిన ‘లక్ష్య’, ‘రంగ రంగ వైభవంగా’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. కానీ పెద్దగా హిట్లు దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ కెరీర్ కాస్తా స్లోగా నడుస్తోంది. కానీ ప్రస్తుతం ‘బ్రో’ చిత్రంతో హిట్ కొట్టేందుకు సిద్దంగా ఉంది. 
 

పవర్ స్టార్ వపన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో కేతికా హీరోయిన్ గా నటిస్తోంది. రేపు గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక సినిమాతోనైనా ఈ ముద్దుగుమ్మ కెరీర్ మారుతుందని ఆశిస్తున్నారు. ఒక్కరోజులో ఫలితం తెలియనుంది. 
 

ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. మరోవైపు కేతికా కూడా బ్యూటీఫుల్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ సినిమాను మరింతగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చింది. స్టన్నింగ్ ఫోజులతో మతులు పోగొట్టింది. 

యంగ్ హీరోయిన్ కేతికా ఎప్పుడూ నెట్టింట ట్రెండీ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ అందాల సునామీ లేపుతున్న విషయం తెలిసిందే. గ్లామర్ విందులో, మత్తెక్కించే పరువాల ప్రదర్శనలో ఏకంగా స్టార్ హీరోయిన్లతో ఈ ముద్దుగుమ్మ పోటీ పడుతోంది. ఇక తాజాగా మాత్రం చీరకట్టి మంత్రముగ్ధులను చేసింది. 
 

స్లీవ్ లెస్ బ్లౌజ్, చెమ్కీల చీరలో మెరిసిపోయింది. బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. హోయలు పోతూ మంత్రముగ్ధులను చేసింది. మరోవైపు చీరకొంగు జరిపి ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తు ఫోజులతోనూ నెటిజన్లకు ఊపిరాడకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

Latest Videos

click me!