`బ్రో` ఐటెమ్‌ బ్యూటీ డ్రెస్‌ కాస్ట్ వైరల్‌.. చూడ్డానికి నైట్‌ డ్రెస్సే, ఖరీదు తెలిస్తే ఫ్యూజులు ఔట్‌..

Published : Jun 05, 2023, 10:42 PM IST

టాలీవుడ్‌కి ఐటమ్‌ గార్ల్ గా పరిచయమై ఇప్పుడు హాట్‌ కేక్ లా మారింది ఊర్వశి రౌతేలా. ఐటెమ్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఈ బ్యూటీ ఇటీవల డ్రెస్సులు, లగ్జరీ లైఫ్‌ విషయంలో వార్తల్లో నిలుస్తుంది.   

PREV
15
`బ్రో` ఐటెమ్‌ బ్యూటీ డ్రెస్‌ కాస్ట్ వైరల్‌.. చూడ్డానికి నైట్‌ డ్రెస్సే, ఖరీదు తెలిస్తే ఫ్యూజులు ఔట్‌..

బాలీవుడ్‌లో నటిగా,  ఐటెమ్‌ భామగా ఫేమస్‌ అయ్యింది ఊర్వశి రౌతేలా. దీంతోపాటు క్రికెటర్‌ పంత్‌ లవర్‌గా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ బ్యూటీని ఈ ఏడాది టాలీవుడ్‌కి పరిచయం చేశారు మెగాస్టార్‌ చిరంజీవి. `వాల్తేర్‌ వీరయ్య`లో ఐటెమ్‌ సాంగ్‌ చేయించారు. `బాస్‌ పార్టీ` సాంగ్‌లో ఉర్రూతలూగించింది. 
 

25

దీంతోపాటు ఇటీవల `ఏజెంట్‌`లోనూ `వైల్డ్ సాలా` సాంగ్‌కి స్టెప్పులేసింది. ఘాటు అందాలను చూపిస్తూ ఐటెమ్‌ భామకి అదిరిపోయే డాన్సులతో మంత్రముగ్డుల్ని చేసింది. సినిమాకి గ్లామర్‌ తీసుకొచ్చింది. సినిమా ఆడకపోయినా, పాట మాత్రం మంచి ఆదరణ పొందింది. యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ ఇటీవల లగ్జరీ ఇళ్లు కొని హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఇటీవల సుమారు రూ.190కోట్లతో పెద్ద బంగ్లా సొంతం చేసుకున్న ఈ భామ మరో విషయంలో చర్చనీయాంశం అవుతుంది.

35

ఆమె ధరించి డ్రెస్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. తాజాగా ఈ బ్యూటీ ఎయిర్‌ పోర్ట్ లో మెరిసింది. ఇందులో పింక్‌ డ్రెస్‌ ధరించింది. చూడ్డానికి కాజ్వల్‌గానే ఉన్న ఈ డ్రెస్‌ ఖరీదు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. తాజాగా ఆమె ధరించిన డ్రెస్‌ ఏకంగా లక్ష రూపాయలు కావడం విశేషం. చూడ్డానికి నైట్‌ డ్రెస్‌ ని తలపించేలా ఉన్న ఈ భామ డ్రెస్‌కి రూ.91వేలు అట. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్ అవుతుంది.

45

ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రేషన్స్ కి రూ.93లక్షలు ఖర్చు పెట్టింది ఊర్వశి. ఓ బర్త్ డే సెలబ్రేషన్స్ కి ఇంత భారీగా ఖర్చు చేయడం ఆశ్చర్యపరుస్తుంది. ఎంతటి సంపన్నులైనా ఈ రేంజ్‌లో ఖర్చు పెట్టరు. కానీ ఊర్వశి మాత్రం మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా ఖర్చు చేస్తుండటం గమనార్హం. దీంతో ఊర్వశి రౌతేలాకి ఇంతటి మనీ ఎలా వస్తుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
 

55

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఐటెమ్ సాంగ్‌కి రెడీ అవుతుంది. పవన్‌ కళ్యాణ్‌తో ఆమె స్పెషల్‌ సాంగ్‌లో మెరవబోతుంది. `బ్రో` చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ కోసం ఊర్వశిని ఫైనల్‌ చేశారట. ప్రస్తుతం ఈ పాట షూటింగ్‌ కోసమే ఆమె హైదరాబాద్‌కి వచ్చినట్టు సమాచారం. ఈ పాటకి భారీగానే డిమాండ్‌ చేస్తుందట. దీంతోపాటు బోయపాటి, రామ్‌ చిత్రంలో నటిస్తుంది ఊర్వశి, మరోవైపు `బ్లాక్‌ రోజ్‌`, హిందీలో `దిల్‌ హై గ్రే` చిత్రాల్లో నటిస్తుందీ సెక్సీ బాంబ్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories