భారీ స్థాయిలో ’ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆ డైరెక్టర్ ప్లానింగ్ తో గుర్తుండిపోయేలా ఏర్పాట్లు.. డిటేయిల్స్

First Published | Jun 5, 2023, 9:08 PM IST

ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారతీయ సినీ చరిత్రలోనే ముందెన్నడూ లేనివిధంగా ఏర్పాట్లు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. 
 

హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా, రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) రాఘవుడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon)  సీతగా నటించిన విషయం తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. 
 

మరో పదిరోజుల్లో జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ప్రస్తుతం ప్రమోషన్స్ ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో రేపు భారీ ఏర్పాట్లతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదికను సిద్దం చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈవెంట్ నిర్వహించబోతున్నారు. శ్రేయాస్ మీడియా ఆర్గనైజ్ చేస్తుండగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ  ప్లానింగ్ లో ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈవెంట్ ఆసక్తికరంగా మారింది.


తిరుపతిలో భారతీయ సినీ చరిత్రలోనే ముందెన్నడూ లేనివిధంగా ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. యుగయుగాలకు గుర్తుండిపోయే స్థాయిలో ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. బిగ్గెస్ట్ ఈవెంట్ గా నిలవబోతోంది. మేకర్స్ సినిమా ప్రమోషన్ విషయంలో విపరీతమైన శ్రద్ధ వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ ని చాలా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు.

ఈవెంట్ కు మతగురు, ఆధ్యాత్మిక ఉపాన్యాసాలకు ప్రసిద్ది చెందిన చిన జీయర్ స్వామి ముఖ్య అథిగా హాజరు కాబోతున్నారు. తన దైవిక ఆశీర్వాదాలను కురిపించనున్నారు. 
ఇక ఈవెంట్ లో జరగబోతున్న మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చరిత్రలో తొలిసారిగా... ఈ ఈవెంట్‌లో ప్రభాస్ 50 అడుగుల హోలోగ్రామ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. రాముడు, వేంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అవతారాలు కాబట్టి తిరుపతిలో అయోధ్య యొక్క భారీ సెట్‌ను ఏర్పాటు కూడా చేస్తున్నారు.
 

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకా చకా కొనసాగుతున్నాయి. ఆ ఫొటోలు కూడా నెట్టింట వైరల్ గా మారింది. మరోవైపు  ఆదిపురుష్, రామాయణం పాటలతో ఈ ఈవెంట్లో 100 మంది డ్యాన్సర్లు, 100 మంది గాయకులు ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఈవెంట్ కు లక్ష మందికి పైగా ప్రేక్షకులు హాజరు కాబోతున్నారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. మరో చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే ఈ ఈవెంట్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది.
 

ఈవెంట్ కు యాంకర్ ఝాన్సీ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. రేపు జరగబోయే ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ ను విజయవంతం చేసేందుకు అభిమానులు, ప్రేక్షకులు కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈవెంట్ లో భాగంగా మరో ట్రైలర్ కూడా విడుదల కాబోతుందని తెలుస్తోంది. మొత్తానికి అందరి చూపు Adipurush Pre Release ఈవెంట్ పైనే ఉంది. 

Latest Videos

click me!