Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ భయపడే ఒకే ఒక్క విషయం.. ఏంటో తెలుసా?

Published : Mar 10, 2024, 03:25 PM ISTUpdated : Mar 10, 2024, 04:29 PM IST

బాలీవుడ్ కింగ్ ఖాన్ రీసెంట్ గా వరస పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలతో పాటు ఆయన వ్యక్తిగత విషయాలు కూడా ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.  

PREV
16
Shah Rukh Khan : షారుఖ్ ఖాన్  భయపడే ఒకే ఒక్క విషయం.. ఏంటో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) చివరిగా జవాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
 

26

జపాన్ తర్వాత డంకీ చిత్రంతో వచ్చిన షారుఖ్ ఖాన్ మునుపటి చిత్రాల స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. ఏదేమైనా వరస పెట్టి సినిమాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ ఆకట్టుకుంటున్నారు.

36

రీసెంట్ గా షారుఖ్ ఖాన్ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తనయుడు అనంత అంబానీ వివాహ వేడుకలో సతీమణితో కలిసి కనిపించారు. ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణ గాను నిలిచారు. ఈ క్రమంలో షారుక్ ఖాన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది.
 

46

షారుక్ ఖాన్ ఇప్పటివరకు ఎన్నో వేల కోట్లు సంపాదించుకున్నారు. తన జీవితంలో ఎదురైన సమస్యలను కూడా అవలీలగా పరిష్కరించుకున్నారు. అలాంటి వ్యక్తి ఓ విషయంలో చాలా బాధపడతానని, తనను ఏడిపించే విషయం కూడా అదేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

56

తను ఎవరితోనైనా అటాచ్మెంట్ పెంచుకుంటే అనుకోని పరిస్థితుల్లో వారు దూరమైతే చాలా ఏడుస్తానని చెప్పారు. అటాచ్మెంట్ వల్లనే బాధ కలిగించే సందర్భాలు ఏర్పడతాయి అన్నారు. ఆయన ఆ ఒక్క విషయంలోనే భయపడతానని చెప్పారు. 

66

షారుక్ ఖాన్ కు పలు సెంటిమెంట్లు ఉన్న విషయం తెలిసిందే. దైవభక్తి, న్యూమరాలజీ అటువంటి వాటిని నమ్ముతారు. ఇక జీవితంలోనూ ఇతరులతో ఎక్కువగా అటాచ్మెంట్ పెంచుకోవాలన్నా కూడా భయపడతారని తెలిసింది. నిజానికి మనకు ఎంతో దగ్గరైన వ్యక్తులు పరిస్థితుల కారణంగా దూరమైతే ఎలా ఉంటుందో తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ ఓల్డ్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories