నిహారిక-వెంకట చైతన్య విడాకుల వార్తలకు బ్రేక్... మెగా డాటర్ కాంప్రమైజ్ అయ్యారా?

Published : Apr 09, 2023, 07:49 PM IST

నిహారిక కొణిదెల భర్త వెంకట చైతన్యతో విడిపోతున్నారంటూ కథనాలు వెలువడుతుండగా ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. నిహారిక విడాకుల ఆలోచన విరమించుకున్నారని తాజా సమాచారం.   

PREV
16
నిహారిక-వెంకట చైతన్య విడాకుల వార్తలకు బ్రేక్... మెగా డాటర్ కాంప్రమైజ్ అయ్యారా?

కొన్ని రోజులుగా మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భర్త వెంకట చైతన్య సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంతో ఈ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ నుండి నిహారిక ఫోటోలు మొత్తం తొలగించారు. అలాగే ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో అయ్యారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. 
 

26


ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ నుండి ఎవరూ స్పందించలేదు. పరోక్షంగా హింట్ కూడా ఇవ్వలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. నిహారిక-వెంకట చైతన్య విడిపోవాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో పేరెంట్స్ కన్విన్స్ చేసే పనిలో ఉన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. స్వయంగా చిరంజీవి రంగంలోకి దిగారన్నమాట వినిపించింది. 

36
Image: Upasana Kamineni Konidela / Instagram

తాజాగా నిహారిక-వెంకట చైతన్య కలిసి ఉన్న ఫోటో ఒకటి వైరల్ చేస్తున్న మీడియా వర్గాలు... కలిసి పోయారని కథనాలు రాస్తున్నాను. పెద్దల జోక్యంతో  ఒక్కటైపోయారనే వాదన వినిపిస్తోంది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. 
 

46

ఒక మనసు మూవీతో నిహారిక వెండితెరకు పరిచయమయ్యారు. అయితే ఆమెకు గుర్తింపు తెచ్చే ఒక్క హిట్ కూడా పడలేదు. హీరోయిన్ గా నటించిన చిత్రాలు పరాజయాలు ఎదుర్కొన్నారు. డెబ్యూ మూవీ మాత్రమే కొంతలో కొంత మెరుగు అనిపించింది. సైరా మూవీలో నిహారిక చిన్న క్యామియో రోల్ చేశారు. 

56


హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో తండ్రి నాగబాబు కండీషన్ ప్రకారం పెళ్ళికి ఒప్పుకుంది. బుద్దిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. 2020 డిసెంబర్ నెలలో నిహారిక వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. నిర్మాతగా వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నారు. గతంలో కూడా నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్ లో నాన్న కుచ్చి, మ్యాడ్ హౌస్ వంటి సిరీస్లు నిర్మించారు. 

66

గత ఏడాది నిహారిక కొన్ని  వివాదాల్లో చిక్కుకున్నారు. లేట్ నైట్ పార్టీలో పాల్గొన్న నిహారిక అధికారుల దాడిలో పట్టుబడ్డారు. పోలీసులు ఆమెను స్టేషన్ కి తీసుకెళ్లి విచారించారు. ఆ పబ్ లో డ్రగ్స్ వాడినట్లు ఆధారాలు లభించగా విచారణ ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలు నాగబాబు ఖండించారు. నిహారిక ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులే క్లీన్ చిట్ ఇచ్చినట్లు వెల్లడించారు. కొన్నాళ్ళు సోషల్ మీడియాకు దూరమయ్యారు.

click me!

Recommended Stories