యష్ మంచం పై పడుకుంటాడు. ఇప్పుడు వారిద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ మేము ఇన్ని రోజులు దగ్గరగా ఉన్నా దగ్గర కాలేకపోయాము అందుకు మాకు మేమే కారణం కదా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు యష్ వేద ఇద్దరు ఒకరి మనసులో ఒకరు ఒకేలాగా ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటారు. అప్పుడు వారిద్దరూ ఒకరి వైపు ఒకరు అలాగే తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం వేద ఇంటి బయట ముగ్గు వేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి రాణి,రాజా వేదన చూసి మురిసిపోతూ ఉంటారు. ఇంతలోనే యష్, బయటకు వచ్చి వేద వైపు అలాగే చూస్తూ ఉంటాడు.