Samantha Item Song: సమంత ఇప్పుడు చేసింది.. బ్రహ్మీ 25ఏళ్ల క్రితమే చేశాడట.. ట్రోల్స్ పై కామెంట్‌

Published : Dec 24, 2021, 10:05 PM IST

సమంత ఐటెమ్‌ సాంగ్‌ ఇప్పుడు ఓ ఊపు ఊపుతుంది. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన `పుష్ప` చిత్రంలో సమంత `ఊ అంటవా.. ఉఉ అంటావా` అంటూ సాగే ఐటెమ్‌ సాంగ్‌కి హాట్‌ స్టెప్పులేసిన విషయం తెలిసిందే.   

PREV
16
Samantha Item Song: సమంత ఇప్పుడు చేసింది.. బ్రహ్మీ 25ఏళ్ల క్రితమే చేశాడట.. ట్రోల్స్ పై  కామెంట్‌

సమంత ఫస్ట్ టైమ్‌ ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. దీంతో ఇది సంచలనంగా మారింది. అనేక విమర్శలతోపాటు ప్రశంసలు దక్కాయి. ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అయ్యింది. ఏకంగా వంద మిలియన్స్ వ్యూస్‌ని దక్కించుకుంది. ఓ రకంగా ఇది ఉర్రూతలూగించింది. అయితే `పుష్ప` సినిమాలో మాత్రం ఈ పాటపై విమర్శలు వచ్చాయి. సగంలోనే కట్‌ చేశారని, కరెక్ట్ ప్లేస్‌లో సెట్‌ చేయలేదనే విమర్శలు వచ్చాయి. 
 

26

ఇదిలా ఉంటే ఈ పాట్‌ని ట్రోల్స్ చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఈ సాంగ్‌ని, సమంతని ట్రోల్స్ చేయడం విశేషం. అంతేకాదు ఇందులోని సమంత పోజులకు మీమ్స్ చేసి వైరల్‌ చేస్తున్నారు. అందులో భాగంగా ఓ మీమ్ ఇప్పుడు మరింత హాట్‌ టాపిక్‌ అయ్యింది. అంతేకాదు వైరల్‌ అవుతుంది. 
 

36

అన్‌ ప్రొపేషనల్‌ ట్రోలర్స్ పేరుతో ఓ మీమ్‌ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.ఇందులో సమంత ఓ హాట్‌ పోజుని బ్రహ్మానందంతో పోల్చుతున్నారు. ఆయన నటించిన సినిమాల్లోని ఓ పోజుని, సమంత ఇచ్చిన పోజుకి మ్యాచ్‌ చేస్తూ కాపీ కొట్టారంటూ ట్రోల్స్ చేయడం విశేషం.

46

బ్రహ్మానందం చేసిన దాన్ని మీరు కాపీ కొట్టడం ఆపేయండి సమంతగారు అంటూ మీమ్స్ చేశారు. చివరికి ఐటెమ్‌ సాంగ్స్ లను కూడా కాపీ కొడతారా అనే రేంజ్‌లో సమంతపై విరుచుకుపడ్డారు. బ్రహ్మీ ఫోటోని వాడుకుని మీమ్స్ చేయడం సర్వత్రా హాట్‌ టాపిక్‌ అయ్యింది. జనరల్‌గా ఇలాంటి మీమ్స్ సర్వసాధారణమే. బ్రహ్మానందంనే ఎక్కువగా ఇలాంటి మీమ్స్ కి వాడతారు. ఇందులో కొత్తేమీ లేదు. 

56

కానీ దీనిపై బ్రహ్మానందం స్పందించడం హాట్‌ టాపిక్‌కి కారణమైంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మానందం తన ఫోటోని, సమంత `ఊ అంటావా..` పాటతో మ్యాచ్‌ చేసిన మీమ్స్ ని చూశాడట. దీంతో ఆయన ఈ వేదికగా స్పందించారు. 

66

తాను 25ఏళ్ల క్రితమే ఈ పోజు ఇచ్చానని చెప్పారు. `నేను ఎప్పుడో 25ఏళ్ల క్రితం అలా అన్నాను. దానికి బ్రహ్మీని సమంత కాపీ కొట్టిందనడం ఎంత దుర్మార్గం` అంటూ తనదైన స్టయిల్‌లో కామెడీ సెన్స్ లో పంచ్‌ వదిలారు. సమంత పాటపై ఆయన స్పందించడంతో ఇప్పుడా విషయంలో వైరల్‌గా మారింది. మరోవైపు `పుష్ప` సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories